AP: శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వారి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో పండుగ వేళల్లో, రద్దీ సమయాల్లో స్వామి వారి స్పర్శ దర్శనం వెసులుబాటు ఉండేది కాదు. తాజాగా అన్ని వేళల స్పర్శ దర్శనం చేసుకునేలా ఆలయ ఈవో శ్రీనివాస రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ADB: సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ క్రీడా దుస్తులను మంగళవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు.
BPT: చేనేత కార్మికుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. భట్టిప్రోలులోని రైల్ పేటలో మంగళవారం HWCS ఆధ్వర్యంలో 26మంది చేనేత లబ్దిదారులకు ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ కింద మంజూరైన రూ.13లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉందన్నారు.
ASR: అరకు మండలం బీజగూడ, కొంత్రాయిగూడ, కంజరితోట గ్రామాల్లో నెలకొన్న రహదారి, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. మంగళవారం గిరిజన సంఘం నేతలతో కలిసి ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించారు. అనంతరం గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.
KDP: సిద్దవటం మండలంలోని కడప, చెన్నై జాతీయ రహదారి, భాకరాపేట కూడలిలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. మంగళవారం ఉదయం కడప బద్వేల్ తిరుపతి నుండి వచ్చే వాహనాలు రద్దీ పెరగడంతో వాహనాలు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు వాపోతున్నారు.
SKLM: ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని రాజాం కమిషనర్ రామప్పలనాయుడు అన్నారు. రాజాం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డుపై చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఇంటి చెత్తను రోడ్డుపై వేయకూడదన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
TG: విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలు కచ్చితంగా స్కూల్లో పెట్టాలని ఆదేశించింది. పాఠశాలల్లో ఒకరికి బదులు మరోకరు బోధనలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం.
KMM: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గార్డెన్ సెక్షన్‌లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గురవయ్య కోరారు. మంగళవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు.
ప్రకాశం: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్‌ను, తమ రాజకీయ లబ్ధి కోసం, జగన్ వద్ద మెప్పు పొందేందుకు అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
SRD: హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహనికి మంగళవారం నర్సాపూర్ శాసన సభ్యురాలు ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
CTR: చౌడేపల్లి మండలం ప్రముఖ శక్తి స్వరూపిణిగా విరజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మను మంగళవారం కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ EO ఏకాంబరం ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
NLR: వీధి వ్యాపారుల సంక్షేమానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశాలు మేరకు నగరంలో ప్రయోగాత్మకంగా “స్మార్ట్ స్ట్రీట్ బజార్” ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. టౌన్ వెండింగ్ కమిటీ ఛైర్మన్ అధ్యక్షునిగా కమిషనర్ ఆధ్వర్యంలో సభ్యులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
KMR: కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా MLA మీడియాతో మాట్లాడారు. చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు. అనుమతి ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లమంటున్నారని అన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
ELR: ఉంగుటూరు బాదంపూడి సచివాలయాన్ని మంగళవారం ఎంపీడీవో ఆర్జి మనోజ్ తనిఖీ చేశారు. NPCI, GEO, MSME సర్వే పై సచివాలయం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పల్లె పండుగ కార్యక్రమంలో జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాకర్ల వెంకట గిరిధర్, పంచాయతీ, సచివాలయ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీకర్ హత్యాచార ఘటనపై సుమోటో కేసు విచారణను 2025 మార్చిలో చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్యులు, వైద్య సిబ్బంది విషయంలో లింగ ఆధారిత హింసను అరికట్టేందుకు, భద్రతా ప్రొటోకాల్‌ల రూపకల్పన కోసం ‘నేషనల్ టాస్క్‌ఫోర్స్’కు సూచనలు పంపాలని కోరింది. సెక్యూరిటీ ప్రొటోకాల్స్, ఇతర అంశాల్లో సుప్రీంకోర్టు నియమించిన ‘నేషనల్ టాస్క్‌ఫోర్స్’.. 12 వారాల్లో నివేదిక ఇస్తుంద...