నల్గొండ: జిల్లా పోలీసు శాఖలో పదవి విరమణ పొందిన SI దుర్గా రెడ్డి, ఆసాయి ఫరీద్, నిరంజన్‌లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో వారి సేవలు ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొని శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ సిబ్బంది షేక్ తాయూబ్, మరియాదాస్ కుటుంబ సభ్యులకు చేయూత చెక్కులు అందజేశారు.
తమిళ స్టార్ హీరో, TVK అధినేత విజయ్ దళపతికి భార్య సంగీత షాక్ ఇచ్చింది. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1999లో వివాహం చేసుకున్న ఈ జంటకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత ఏడాది నుంచి వీరు విడిపోతారనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడది నిజమైంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
ప్రకాశం: కొమరోలు మండలంలోని అల్లినగరం గ్రామంలో గల చిక్కుడు పంటను ఉద్యాన శాఖ అధికారి శ్వేత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో పేను బంక, తదితర చీడపీడలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అగ్రికల్చర్ అసిస్టెంట్, స్థానిక రైతులు పాల్గొన్నారు.
జింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ ఈ మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం తనను తీవ్రంగా ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. అభిషేక్ ఎంతటి విధ్వంసకర బ్యాటరో అందరికీ తెలిసిందేనని.. కానీ ఈ మ్యాచ్‌లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆడాడని పేర్కొన్నాడు. ఇకపై ఇదే శైలిలో ఆడాలని అతడికి సూచించాడు.
KMM: కేసీఆర్ పాలనలో రహదారులు అద్వానంగా ఉండేవని, కానీ ప్రజా ప్రభుత్వం రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం ఏన్కూరు మండలం గార్ల ఒడ్డులో రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.
TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అన్ని నియోజక వర్గాలు, జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యత పనులపై సమీక్ష నిర్వించారు. ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీఆర్‌వోలు, ఆర్టీవో, జిల్లా పంచాయతీ, మున్సిపల్ అధికారులు, టిడ్కో, సీపీవో, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
W.G: నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రామరాజు ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
HYD: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
SKLM: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ అన్నారు . శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నరసన్నపేటలో ఏప్రిల్ 4, 5 తేదీలలో జరిగే మహాసభలకు కార్మికులు, రైతులు తరలిరావాలని కోరారు. జిల్లాలో భూమి,నిర్వాసితుల సమస్యలు, ఉపాధి హామీ అమలు వంటి అంశాలపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
PPM: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాలులో శుక్రవారం జరిగిన ‘గిరిజన పీజీఆర్ఎస్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గిరిజనుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. అయిదు ప్రధాన వినతులు అధికారుల దృష్టిలోకి వచ్చాయన్నారు. ఈ సందర్బంగా పిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
KDP: పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాడు ముద్దునూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో ఉన్న రికార్డులను సక్రమంగా ఉన్నాయా లేదా పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై సంబంధిత సీఐ నగేష్ బాబుతో సమీక్ష నిర్వహించారు.
MDK: ఢిల్లీ JNU యూనివర్సిటీ VC శాంతి దూలపూడి పండిత్‌లను వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కార్యదర్శి చింతకాయల అజయ్ కుమార్ అన్నారు. మెదక్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. గత వారం రోజుల క్రితం ఢిల్లీలోని JNU యూనివర్సిటీలో కొంత మంది మతోన్మాద సంఘాల నాయకులు సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులపై అలాగే అధ్యాపకులపై దూషించారన్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్ తురైరాజా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. ముత్యాల గర్భాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. భారతీయ కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఇకపై తమ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సొంతంగానే విడుదల చేయనుంది. ప్రస్తుతం హోంబలే చేతిలో ‘కాంతార-2’, ‘సలార్-2’, ఎన్టీఆర్-నీల్ ‘డ్రాగన్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.