నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిని ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుస్తామని సర్పంచ్ యుగంధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వాణిజ్య, నివాస రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.
NZB: నవీపేట్ మండలం పాల్దా-జన్నెపల్లి రహదారిపై కొండూర్ కమాన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం, ఎక్సెల్ స్కూటీని ఢీకొట్టింది. బీహార్‌కు చెందిన వ్యవసాయ కూలీలు పరశురాం, హరిచరణ్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారికి 108 ఈఎంటీ నవీన్, పైలట్ మురళీ కృష్ణ ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్టీమ్ ఎక్స్‌పో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను పదును పెట్టేంటెందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయిని అన్నారు. వేణుగోపాల్ రావు, సరిత, సుబ్రమణ్యం, రంగసాయి, పార్వతిదేవి, తదితరులు పాల్గొన్నారు.
HYD: ఐక్య రాజ్య సమితి పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్ ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్న అనితా మెండిరట్ట శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. చారిత్రాత్మక భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం పాతబస్తీలో పూసలు, గాజులు విక్రయించారు. వీటితోపాటు ఫేమస్ హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఆస్వాదించారు.
VKB: ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ స్నేహ మెహ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం పరిగిలో ‘అరైవ్ అలైవ్’ భద్రతా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించి, కానిస్టేబుళ్లకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
అన్నమయ్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలంలో శనివారమే పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీఓ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని 11,203మంది లబ్ధిదారులకు రూ.4 కోట్ల,92 లక్షల 56 వేల 500 లు అందచేస్తామన్నారు. శనివారం ఉదయం 7గంటల నుంచే ఇస్తామన్నార.
KDP: దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కల్పించని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా కల్పిస్తోందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం సిద్దవటం మండలం ఉప్పరపల్లెలో జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని రామయ్య ప్రారంభించారు. రామయ్య మాట్లాడుతూ.. సామాజిక న్యాయ సాధనలో జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు.
KRNL: ఆస్పరి మండలం పుట్టకలమర్రి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి శుక్రవారం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనితకు సిటీ స్కాన్ అవసరమని డాక్టర్ చెప్పడంతో, మెరుగైన చికిత్సకు తక్షణ ఏర్పాట్లు చేస్తామని అయన హామీ ఇచ్చారు.
KRNL: ఎమ్మిగనూరులో పాల డైరీ కేంద్రాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక తిరుమల పాల డైరీ కేంద్రాన్ని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ పరిశీలించి పాల పాకెట్లు, పాలను ల్యాక్టోమీటర్‌తో పరీక్షించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో పాల శ్యాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.
ASF: దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన అల్లి భాగ్యమ్మకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 75,000 LOC లెటర్‌ను MLA హరీష్ బాబు శుక్రవారం అందజేశారు. భాగ్యమ్మకి మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నగదు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నంద్యాల: జిల్లా డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి వద్ద శుక్రవారం కారు క్రేన్ ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తిరుమల దర్శనం ముగించి కర్నూలు వైపు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే మృతి చెందారు. ప్రదీప్ తీవ్రంగా గాయపడి స్థానికులు ఆసుపత్రికి తరిలించారు.
NLG: చిట్యాల మండలం ఎలికట్టే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు NMMS ఫలితాలలో ఘనవిజయం సాధించారు. పాఠశాలకు చెందిన పి.హరిణి, ఎస్.కావ్యశ్రీ ఉపకార వేతనాలకు ఎంపికైనట్లు హెచ్ఎం నర్సింహా తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు రాంభూపాల్, రవి, పి.వెంకన్న, బి.రామ్మోహన్, డి.వెంకన్న, ఎ.దుర్గయ్య, పి.వెంకన్న అభినందించారు.
ATP: అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నసీరుద్దీన్ మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. గుండెపోటుతో మరణించిన ఆయన కుటుంబానికి జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు తక్షణ సాయంగా సిబ్బంది రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐ రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.