గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ఉచితంగా పంపిణీ చేయనుంది. ఏపీలో సీఎం చంద్రబాబు, TGలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభిస్తారు. బాలికల వయస్సును ఆధార్ కార్డు ఆధారంగా నిర్ధారిస్తారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా వేయనున్నారు.