ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హథ్రాస్‌లో కారు- కంటెయినర్ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సీపీఐ రాజోలు ఏరియా కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్ కోరారు. మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం సఖినేటిపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
BDK: పినపాక మండలంలో పనిచేసే పంచాయతీ సెక్రెటరీలు పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని మండల పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మంగళవారంలో ఓ ప్రకటనలో కోరారు. ప్రతి పంచాయతీ సెక్రటరీ పారిశుధ్యంతో పాటు, వీధి దీపాల నిర్వహణ, మంచినీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచడం వంటి పనులను కచ్చితంగా చేయాలన్నారు. ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
NLR: ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును అమరావతిలోని సచివాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ, డేగపూడి – బండేపల్లి కాలువ, కనుపూరు కెనాల్ పనులకు నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే త్వరితగతిన పనులు చేపట్టాలని కోరారు.
నంద్యాల: నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామంలో మంగళవారం రెవిన్యూ సర్వీసులు తాహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూములకు సంబంధించిన 14 మంది రైతులు అర్జెంట్ ఇచ్చారని డిప్యూటీ తాహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని తాహసీల్దార్ తెలిపారు.
AP: శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వారి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో పండుగ వేళల్లో, రద్దీ సమయాల్లో స్వామి వారి స్పర్శ దర్శనం వెసులుబాటు ఉండేది కాదు. తాజాగా అన్ని వేళల స్పర్శ దర్శనం చేసుకునేలా ఆలయ ఈవో శ్రీనివాస రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ADB: సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ క్రీడా దుస్తులను మంగళవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు.
BPT: చేనేత కార్మికుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. భట్టిప్రోలులోని రైల్ పేటలో మంగళవారం HWCS ఆధ్వర్యంలో 26మంది చేనేత లబ్దిదారులకు ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ కింద మంజూరైన రూ.13లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉందన్నారు.
ASR: అరకు మండలం బీజగూడ, కొంత్రాయిగూడ, కంజరితోట గ్రామాల్లో నెలకొన్న రహదారి, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. మంగళవారం గిరిజన సంఘం నేతలతో కలిసి ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించారు. అనంతరం గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.
KDP: సిద్దవటం మండలంలోని కడప, చెన్నై జాతీయ రహదారి, భాకరాపేట కూడలిలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. మంగళవారం ఉదయం కడప బద్వేల్ తిరుపతి నుండి వచ్చే వాహనాలు రద్దీ పెరగడంతో వాహనాలు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు వాపోతున్నారు.
SKLM: ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని రాజాం కమిషనర్ రామప్పలనాయుడు అన్నారు. రాజాం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డుపై చెత్త వేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఇంటి చెత్తను రోడ్డుపై వేయకూడదన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
TG: విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలు కచ్చితంగా స్కూల్లో పెట్టాలని ఆదేశించింది. పాఠశాలల్లో ఒకరికి బదులు మరోకరు బోధనలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం.
KMM: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గార్డెన్ సెక్షన్‌లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గురవయ్య కోరారు. మంగళవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు.
ప్రకాశం: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్‌ను, తమ రాజకీయ లబ్ధి కోసం, జగన్ వద్ద మెప్పు పొందేందుకు అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
SRD: హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహనికి మంగళవారం నర్సాపూర్ శాసన సభ్యురాలు ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.