SKLM: జిల్లా కేంద్రంలో ఉన్న 1,2 APSRTC డిపోలను జోన్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత శుక్రవారం సందర్శించారు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను మెరుగ్గా అందజేయాలని డిపో అధికారులకు ఆదేశించారు. 2 డిపోల్లో ఉన్న అన్ని సెక్షన్లను తనిఖీ చేసి సిబ్బంది అందరితో గేట్ మీటింగ్ నిర్వహించారు. బస్సులు కండిషన్లో ఉంచాలన్నారు.