• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉదయగిరిలో ఇంటి పన్నులు చెల్లించనివారిపై చర్యలు

NLR: ఉదయగిరి మేజర్ పంచాయతీలో ఇంటి పన్నులు చెల్లించని వారిపై శాఖా పరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో ఎస్.మోహన్ రావు తెలిపారు. పట్టణంలోని ఇంటి యజమానులు పంచాయతీ అధికారులకు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 27, 2026 / 12:23 PM IST

దేవాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

JGL: జగిత్యాల పట్టణంలోని చింతకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఫాల్గుణ మాస శుక్ల పక్ష శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. అలాగే భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.

February 27, 2026 / 12:22 PM IST

‘వార్డు సభ్యులు కీలకపాత్ర పోషించాలి’

MNCL: గ్రామాల అభివృద్ధి వార్డు సభ్యుల చేతుల్లోనే ఉందని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది.. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలపై వార్డు సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు.

February 27, 2026 / 12:22 PM IST

రంగంపేటలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు

E.G: రంగంపేటలో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శివాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. MLA నల్లమిల్లి సహకారంతో రూ.1.50 కోట్ల నిధులు మంజూరైనట్లు సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మీ దుర్గారావు తెలిపారు. అధికారులు, కూటమి నేతలు, భక్తుల సహకారంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 27, 2026 / 12:20 PM IST

ముఖంపై మొటిమలు తగ్గాలంటే..!

మొటిమల సమస్యతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, ఆకుకూరలు, వాల్‌నట్స్, ఆలివ్ నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజలు వంటివి తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, కొబ్బరినీళ్లు, తగినంత నీరు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. సరైన పోషకాహారంతో ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

February 27, 2026 / 12:20 PM IST

మదనపల్లె -2 టౌన్ ఎస్సైఐగా నాగేశ్వర రావు

అన్నమయ్య: మదనపల్లె రెండో పట్టణ ఎస్సైగా నాగేశ్వర రావు శుక్రవారం ఉదయం రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేస్తున్న రహీముల్లా ఒకటో పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో సాధారణ బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో చౌడేపల్లి ఎస్సైగా పనిచేస్తున్న నాగేశ్వరరావు టూ టౌన్కు వచ్చారు.

February 27, 2026 / 12:19 PM IST

BREAKING: బాల్క సుమన్‌కు స్వల్ప ఊరట

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే బాల్కసుమన్‌కు ఊరట లభించింది. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా ఇటీవల మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం వ్యవహారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

February 27, 2026 / 12:17 PM IST

విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ బహుమతులు

AKP: ఇటీవల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన మోడల్ టెస్ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ‌ బహుమతులు ప్రకటించింది. ఎస్ రాయవరం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం డిప్యూటీ డీఈవో అప్పారావు చేతుల మీదగా 11 మందికి బహుమతులు అందజేసినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం బాలాజీ తెలిపారు. పరీక్షలపై భయం పోగొట్టేందుకు మోడల్ టెస్ట్ నిర్వహించమన్నారు.

February 27, 2026 / 12:15 PM IST

విమానాశ్రయానికి అదనపు భూసేకరణ

ADB: జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. సైనిక అవసరాలతో పాటు పౌర విమానయానానికి అనుకూలంగా మార్చడంతో 3KM రన్‌వే కోసం అదనంగా 249.80 ఎకరాల భూసేకరణ అనివార్యమైంది. దీనిపై అధికారులు రైతులతో చర్చలు జరిపి త్వరలోనే ప్రధానమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేయించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు పనులు వేగమందుకోవాలని చేయాలని కలెక్టర్‌ను కోరారు.

February 27, 2026 / 12:15 PM IST

ప్రధాని మోదీని కలిసిన విజయ్‌, రష్మిక

ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న తమ రిసెప్షన్‌ వేడుకకు రావాలని కోరుతూ వారు ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. FEB 26న రష్మిక, విజయ్ పెళ్లి జరగ్గా.. నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

February 27, 2026 / 12:14 PM IST

అంధకారంలో మహారాజుల కాలనీ

ADB: ఆదిలాబాద్‌లోని రాంపూర్ మహారాజుల కాలనీ విద్యుత్ దీపాలు లేక అంధకారంలో మగ్గుతోంది. రాంపూర్ మున్సిపాలిటీలో విలీనమైనా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు వీధి దీపాలు లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, విష పురుగుల భయం వెంటాడుతోందని వాపోతున్నారు.

February 27, 2026 / 12:13 PM IST

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా

KNR: జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను కలెక్టర్ ఛాంబర్‌లో కలిసిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ పలువురు జిల్లా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు

February 27, 2026 / 12:13 PM IST

కుక్క క‌రిచిన‌ప్పుడు ఏం చేయాలి?

కుక్క కాటు తర్వాత ముందుగా భయపడకూడదు. కుక్క కరిచిన చోట గాయాన్ని సబ్బుతో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. గాయం తీవ్రతను బట్టి డాక్టర్లు ఇంజెక్షన్లు ఇస్తారు. రేబిస్‌తో పాటు టెటనస్ వచ్చే ప్రమాదం ఉన్నందున టెటనస్ షాట్ కూడా తీసుకోవాలి. కనీసం 4 నుంచి 5 మోతాదులు తీసుకోవాలి. ఇది రేబిస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

February 27, 2026 / 12:13 PM IST

మ్యాచ్ గెలిచాం.. కానీ బౌలింగ్ బాలేదు: సూర్య

T20 WCలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ‘బ్యాటర్లందరూ తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. బ్యాటింగ్ పరంగా మా ప్రదర్శనలో ఎలాంటి లోటే లేదు. కానీ బౌలింగ్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మా లోపాలను సరిదిద్దుకుంటాం’ అని తెలిపాడు.

February 27, 2026 / 12:12 PM IST

సుంకాల టెండర్లు వాయిదా

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో దినసరి సుంకం వసూలు చేసుకునే హక్కుకు చేపట్టిన టెండర్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి వాయిదా వేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరగాల్సిన ఈ టెండర్ పాట కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందన్నారు. త్వరలోనే వేలాలను నిర్వహించే తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

February 27, 2026 / 12:10 PM IST