ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో దినసరి సుంకం వసూలు చేసుకునే హక్కుకు చేపట్టిన టెండర్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి వాయిదా వేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరగాల్సిన ఈ టెండర్ పాట కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందన్నారు. త్వరలోనే వేలాలను నిర్వహించే తేదీని ప్రకటిస్తామని తెలిపారు.