SKLM: అక్కువరం గ్రామంలో ఎస్సై రాము ఆధ్వర్యంలో సంకల్పం అవగాహన కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు ఆన్లైన్ మోసాలు, మత్తు పానీయాల అనర్థాలపై అవగాహన కల్పించారు. నేరాలకు దూరంగా శాంతియుతంగా జీవించాలని సూచించారు. అపరిచిత సందేశాలకు స్పందించవద్దని, 112 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా నేర సమాచారాన్ని వెంటనే పోలీసులు తెలియజేయాలన్నారు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం రోడ్డు దాటుతున్న సమయంలో వీఆర్. విద్యాసంస్థలకు చెందిన కారు ఢీకొనడంతో చలపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫిర్యాదులు అందిన వెంటనే త్వరితగిన ఆలస్యం లేకుండా పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. భార్యాభర్తల విభేదాలు, ఆన్‌లైన్ మోసాలు, భూమి తగాదాలు వంటి వివిధ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు.
అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రైల్వే సిబ్బంది, ప్రయాణికులకు NDPS చట్టం కఠిన శిక్షలపై అవగాహన కల్పించారు. రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లో తనిఖీలు నిర్వహించగా నిషేధిత పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
VZM: రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జేసీ సేధు మాధవన్ పాల్గొన్నారు.
VZM: వంగర MPDO రాజారావును సోమవారం మండలంలోని సచివాలయ ఉద్యోగులు కలసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తమపై ప్రభుత్వం మోపుతున్న అదనపు బారం, ఇంటింటికీ వెళ్లి సర్వేలు, ప్రభుత్వ క్యాంపెనింగ్ పనులు చేయించడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. కార్యాలయ పని వేళలు పాటించకుండా అదనపు పని భారం మోపుతున్నారని వాపోయారు.
పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగింది. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై, బతుకమ్మను స్వయంగా ఎత్తుకుని ప్రజలతో కలిసి సంబరాలను ఆస్వాదించారు. ఆయన అందరి సుఖసంతోషాలు, ఆరోగ్యం కోరుతూ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
KDP: కమలాపురం పట్టణంలోని పీవీఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి లక్ష్మన్న జాతీయస్థాయి వాక్‌రేస్‌కు ఎంపికయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో నిర్వహిస్తున్న అండర్ 19 అథ్లెటిక్స్ పోటీల్లో 5కె వాక్ రేస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించాడు. కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు.
జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ బీ. సత్యప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. తొలి రెండు దశల్లో జడ్పీటీ, ఎంపీటీసీ ఎన్నికలు, తరువాత మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 20 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
SKLM: శ్రీకాకుళం ఎంపీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదమంతాలతో ఆశీర్వదించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.
ములుగు డిప్యూటీ కలెక్టర్ నియామకమైన కొత్తపల్లి కుశీల్ వంశీ సోమవారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్‌కు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. విధుల్లో చేరిన కొత్తపల్లి వంశీని కలెక్టర్ అభినందించారు. ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం తల్లిదండ్రులు, బంధు మిత్రులతో సమావేశమయ్యారు.
PDPL: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ గుర్తింపు నుంచి ప్రసూతి వరకు వైద్యం పొందేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్, టీకాలు 100% జరిగేలా చూసి, ఆర్‌బీఎస్‌కే బృందాల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.
JGL: ఇటీవల గ్రూప్-1లో ఎంపికైన కన్నం హరిణి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌ను సోమవారం తన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన ఆమె, డిప్యూటీ కలెక్టర్ హోదాలో శిక్షణ కోసం జగిత్యాల జిల్లాకు నియమితులై, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు.
NZB: అక్టోబర్ 31న నిజామాబాద్ జిల్లాలో మొదటి 15 మండలాల్లోని 281 GPల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు NZB డివిజన్‌లోని NZBరూరల్, డిచ్పల్లి,ఇందల్వాయి, మోపాల్,నవీపేట్ మండలాల్లోని 129 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. BDN డివిజన్‌లోని BDN,చందూరు, కోటగిరి,మోస్రా,పోతంగల్, రెంజల్,రుద్రూర్,సాలూరా,వర్ని, ఎడపల్లి మండలాల్లోని 152 G.P ఎన్నికలు ఉంటాయని అధికారులు తెలిపారు.
NZB: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభను రైతు వేదికలో నిర్వహించారు. ఆ సంఘం కార్యదర్శి బస్వంత్ రావు 2024-25, 2025-26కు సంబంధించి జమ, ఖర్చులు చదివి వినిపించారు. సంఘ చేపట్టిన స్వల్పకాలిక, బంగారంపై రుణాలు, ఎరువులు, విత్తనాల సరఫరా, కొనుగోలు కేంద్రాల ద్వారా వివిధ పంటల కొనుగోలు తదితర అంశాలను సభ్యులకు వివరించారు.