TG: జలవివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దేవాదుల సాక్షిగా కృష్ణా, గోదావరి జలాల సాధనలో వివాదమా?, పరిష్కారమా? అంటే తాము పరిష్కారం కోరుకుంటామని అన్నారు. చర్చలా, పంచాయితీనా అంటే తాము చర్చలే కోరుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే తమ ప్రభుత్వం మందున్న టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.