BNR: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే సేవా పక్షోత్సవంలో భాగంగా చిట్యాల బీజేపీ నేతలు రామన్నపేట మండలం వెల్లంకి చెందిన పద్మశ్రీ గ్రహీత కూరెళ్ల విఠలాచార్యను సోమవారం కలిసి సత్కరించారు. అనేక గ్రంథాలు రచించడంతో పాటు తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి ఎంతోమంది విద్యార్థులకు విద్యా అవకాశాన్ని కల్పించారన్నారు.
ATP: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పరాకాష్టకు చేరాయని వైసీపీ గుత్తి పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక R&B బంగ్లాలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టారన్నారు.
VZM: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గుర్రం జాషువా జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు చేతుల మీదుగా రచయిత గురు ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ, కోటగిరి నారాయణరావు, కుసుమంచి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో ఇవాళ వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే అటువంటి వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.
KRNL: 2029లో YSRCP తిరిగి అధికారంలోకి వచ్చి, జగన్ మోహన్‌రెడ్డి మరోసారి CM అవడం ఖాయమని మంత్రాలయం MLA బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. లోకేశ్ రెడ్ బుక్‌కి భయపడాల్సిన అవసరం లేదన్నారు. YCP డిజిటల్ బుక్‌లో తమను ఇబ్బంది పెట్టే వారి వివరాలు నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చాక తాము అది ఓపెన్ చేస్తామన్నారు.
RR: మన్సురాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేజ్-1లో భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి భక్తులతో కలిసి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక శక్తి మనసుకు శాంతిని ఇస్తుందని, సమాజానికి ఐక్యతను తెస్తుందన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సోమవారం స్థానిక 20వ డివిజన్ ఇస్కాన్ సిటీ ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో పర్యటించారు. యాచక వృత్తిలో ఉన్న ఒక బాలుడిని గమనించి, అతనితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్బంధ విద్య అమలులో భాగంగా వి.ఆర్ మున్సిపల్ హై స్కూల్‌లో చేర్పించేందుకు బాలుని తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్‌పై ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తీవ్ర విమర్శలు చేశాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వడంపై మండిపడ్డాడు. భారత్‌కు అతడొక రన్‌మెషీన్‌లా మారాడంటూ వ్యాఖ్యానించాడు. కాగా, ఆదివారం జరిగిన ఫైనల్‌లో హారిస్ రవూఫ్.. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు.
ADB: బాసరలోని ప్రముఖ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దేవస్థానాన్ని బోథ్ MLA అనిల్ జాదవ్ సోమవారం దర్శించుకున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు మూల నక్షత్రం సందర్భంగా మహాగౌరి అలంకరణ సందర్భంగా అమ్మవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
తూ.గో: గోకవరం గద్దెలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . సోమవారం ఏడవ రోజు కావడంతో అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం 300 మంది చిన్నారులచే సరస్వతీ పూజ నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు.
SRCL: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా తరఫున, సమరసేన అధ్యక్షుల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జమీల్, సహాయ అధ్యక్షుడు జోగం రాజు, ఖజానాదారు ఎండీ రసూల్, ఉపాధ్యక్షుడు ఎండీ అబ్దుల్ వాజిద్, సభ్యుడు సాగర్ తదితరులు పాల్గొన్నారు.
SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగ అక్షయ్ కుమార్ రెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో 228వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీఎం చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయినా, తల్లి రేణుక ప్రోత్సాహంతో, MA పట్టాలు పొంది, పట్టుదలతో ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు.
ASF: బెజ్జూర్ మండలం సోమీని గ్రామానికి చెందిన పంద్రం చందన శ్రీ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో ఐసీడీఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆమె తండ్రి సోమని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈసందర్భంగా చందన శ్రీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఆసక్తితో, కష్టపడి చదివి ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు.
W.G: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో పూలపల్లి నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్స్ ఉదయ మోహన్, అహమ్మద్ మాట్లాడుతూ.. ప్రజలందరూ హృదయ సంబంధం వ్యాధుల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతిమనిషి రోజుకు 10 వేల అడుగులు వేయడం వలన గుండె వ్యాధులను అరికట్టవచ్చన్నారు.
ప్రకాశం: సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట 42వ డివిజన్‌లోని సుందరయ్య కాలనీలో ఇవాళ ఎమ్మెల్యే బిఎన్. విజయ్ కుమార్ రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సేవ కేంద్రం ద్వారా అందిస్తున్నసేవలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ కందుకూరి బాబు, ఏఎంసీ డైరెక్టర్ కామేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.