JGL: నూకపల్లి నాక్ సెంటర్‌లో ఎండపల్లి, వెల్గటూర్, బుగారం, కొడిమ్యాల మండలాలకు చెందిన సర్పంచ్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. గ్రామాభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీ రాజ్ చట్టాలు, నిధుల సమర్థ వినియోగం, గ్రామసభల నిర్వహణ, పారదర్శక పరిపాలన వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రముఖ మొబైల్ కంపెనీ ఐకూ.. ‘ఐకూ 15R’ పేరిట కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 7,600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్, 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 16, ఆరిజిన్ OS 6, IP68, IP69 రేటింగ్, వెనక వైపు 50MP+08MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది.
KRNL: గోనెగండ్ల మండలం గంజహళ్లిలో మహాత్మా బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని దర్గాను దర్శించుకున్నారు. పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముదుగోల్, మహబూబ్ బాషా సంప్రదాయబద్ధంగా శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు.
NDL: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 296 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా డీఐఈవో శంకర్ నాయక్ వెల్లడించారు. మొత్తం 14,424 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల కొందరు రాలేకపోయారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని వివరించారు.
MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గల్లంతైన దుబ్బ నవీన్(30), ఎడ్ల యాదగిరి(24) ఆచూకీ ఇంకా లభించకపోవడంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలన్నారు. అలాగే మృతదేహాలు త్వరితగతిన లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
NRML: జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు మార్చి 18 వరకు, పది పరీక్షలు ఏప్రిల్ 16 వరకు 47 కేంద్రాలలో జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
SKLM: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్ కు బడ్జెట్ లో నిధులు పెంచాలని కోరుతూ శ్రీకాకుళం ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం CITU టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశ రావు ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసవేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయడం లేదని అన్నారు.
కృష్ణా: గుడివాడలో సోషల్ మీడియా, ఈవ్ టీకింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలపై ట్రాఫిక్ ఎస్సై నాగరాజు విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపకూడదని సూచించారు. సోషల్ మీడియా వేదికల్లో తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలను అప్లోడ్ చేయకూడదని తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
NTR: కంచికచర్ల మండల ప్రభుత్వ ఖాజీగా షేక్ అబ్దుల్ రషీద్ నియమితులైన్నారు. మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయనను ఘనంగా సత్కరించారు. మైనారిటీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్క్ బోర్డ్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.
ASR: మార్చ్ 1 ఆదివారం కావడంతో ఈనెల 28న ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ జరగుతుందని అడ్డతీగల ఎంపీడీవో ఎవీవీ కుమార్ పేర్కొన్నారు. ఫింఛను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. మండలంలో ఉన్న 5211 ఫించన్లకు రూ.2,15,48,500లు మంజూరైనట్లు మంగళవారం ఎంపీడీవో తెలిపారు. సచివాలయ సిబ్బంది ఈనెల 27న పింఛను అమౌంట్ బాంకు నుంచి విత్డ్రా చేయాలని అన్నారు.
AP: హెరిటేజ్ సంస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాను రాజకీయాల్లో ఉన్నానని, అందుకే నియమాలు పెట్టుకున్నామని వెల్లడించారు. ఏ దేవాలయానికి పాలు, నెయ్యి సరఫరా చేయొద్దని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి భక్తుడిగా తాను బతికి ఉన్నంత వరకు స్వామి వారి పవిత్రత కాపాడుతానని హామీ ఇచ్చారు.
MDK: నిజాంపేట మండలం నందిగామలో కుంగిన బ్రిడ్జి ప్రయాణికులకు శాపంగా మారింది. అధికారులు వేసిన తాత్కాలిక రహదారి అధ్వానంగా తయారవ్వడంతో రామాయంపేట-సిద్దిపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల వాహనాలు తిరిగే ఈ మార్గంలో భారీ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కోరారు.
AP: మండలిలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ‘రూ.వెయ్యి లోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని అన్నారు. హెరిటేజ్ 750 ఎంఎల్ నెయ్యి రిలయన్స్‌లో రూ.456కి దొరుకుతుంది. హెరిటేజ్‌లో లీటర్ ఆవు నెయ్యి రూ.608కి దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’ అని ప్రశ్నించారు. హెరిటేజ్ వెబ్‌సైట్ ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.
SDPT: రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులకు మాజీ మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని, భయపడద్దని సూచించారు. కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మీ మంచి భవిష్యత్‌కు ఇది పునాది లాంటిదని, పరీక్షలు బాగా రాయాలని కోరారు.
GDWL: ఇంటర్ పరీక్ష సెంటర్ల వద్ద ఎవరైనా అల్లరి చేసినా లేదా కాపీయింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.