ASR: భగత్ సింగ్ యుక్త వయసులోనే యూరోపియన్ విప్లవ ఉద్యమాల గురించి చదివి, సోషలిజం వైపు ఆకర్షితులయ్యారని గిరిజన సమాఖ్య కార్యదర్శి రాధాకృష్ణ, మూల నివాసి సంఘ్ కార్యవర్గసభ్యుడు వైకుమార్ అన్నారు. ఆదివారం భగత్ సింగ్ జయంతిని పాడేరులో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనుషులను చంపగలరు కానీ వారి ఆశయాలు చంపలేరని చాటి చెప్పారని కొనియాడారు.
KMM: అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు అని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. ఆదివారం కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా నుంచి పోలంపల్లి వరకు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
VSP: విశాఖలోని 65వ వార్డులో స్వస్థ్ నారి స్వశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రియదర్శిని కాలనీలోని పబ్లిక్ హెల్త్ సెంటర్ మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించి, మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సిబ్బంది అవసరమైన వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు.
కోనసీమ: మహాకవి, కవి కోకిల గుర్రం జాషువా 130వ జయంతి భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా కడియం గ్రామంలోని గురజాల కృష్ణ ప్రసాద్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మండపేట పట్టణానికి చెందిన గండి స్వామి ప్రసాద్‌కు చెళ్లపిళ్ల కళా సేవా సమితి తూర్పుగోదావరి జిల్లా ఆద్వర్యంలో మహాకవి గుర్రం జాషువా సాహితీ పురస్కారాన్ని అందజేశారు.
MBNR: దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఆహ్వానం మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు రోడ్డులో ఉన్న దుర్గామాత మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు సుఖసంతోషాలతో దసరా పండుగలు జరుపుకోవాలన్నారు.
VZM: డెంకాడలో వైసీపీ డిజిటల్ బుక్‌ను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎటువంటి అన్యాయాలు జరిగినా డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
HYD: హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వయిజరి కమిటీ ఛైర్మన్ బాధ్యతలకు రాష్ట్ర జనసేన పార్టీ ఇంఛార్జి శంకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేతలు పాల్గొన్నారు.
NRML: ఆధ్యాత్మిక మార్గం అన్నింటికంటే ఉత్తమమైనదని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్‌లో ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం, మాజీ వైస్ ఛైర్మన్ కావలి సంతోష్ ఉన్నారు.
NRML: యువత భగత్ సింగ్ ఆశయాలను సాధించాలని సీపీఎం నిర్మల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సురేష్ కోరారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ, అనుబంధ సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని సగర కాలనీలో ఆదివారం నిర్వహించిన శరన్నవరాత్రి వేడుకలకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో దసరా పండగలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
W.G: ఆకివీడు గ్రామ దేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారిని ఆదివారం భీమవరం డీఎస్పీ జయ సూర్య దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జయ సూర్య దంపతులను సన్మానించారు. ఆలయ ఛైర్మన్ గొంట్ల గణపతి, ఆలయ కార్యనిర్వహణాధికారి అల్లూరి సత్యనారాయణ రాజు వారికి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.
BDK: అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవ వేడుకలు I DOC కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనిన కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సంకేత భాష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
SS: హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపికను ఉద్దేశించి టీడీపీ మహిళా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుమతి రెడ్డి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.
E.G: పుల్లలపాడు వద్ద నడిచి వెళ్తున్న భవాని భక్తులు కారు ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దసరా సమయంలో వందలాది భక్తులు తన నియోజకవర్గం మీదుగా విజయవాడకు వెళ్తుంటారని తెలిపారు. భక్తులు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా యాత్ర సాగేలా తగు అవగాహన కల్పించాలని అధికారులకు,నాయకులకు సూచించామని ఆయన వెల్లడించారు.
KNR: SEP 21న ఆదివారం అమావాస్య రోజు చిన్న బతుకమ్మను జరుపుకున్నామని, దాని ప్రకారం SEP 29కి తొమ్మిది రోజులు పూర్తవుతాయని KNRకు చెందిన నమలికొండ రమణాచార్యులు తెలిపారు. రేపే సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని స్పష్టంచేశారు. సద్దుల బతుకమ్మను సోమవారమా లేక మంగళవారం జరుపుకోవాలా అనే సందేహాలు వద్దని పేర్కొన్నారు. అందరూ పండితులం కలిసి తీసుకున్న నిర్ణయం అని తెలిపారు.