VKB: CM రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి చేరుకున్న మంత్రులు వాకిటి శ్రీహరి దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ప్రజలతో మాట్లాడారు. కొండారెడ్డి పల్లిలో రూ .91.71 కోట్లతో వివిధ శాఖల 18 అభివృద్ధి పనులను ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది అన్నారు.
NLG: అసమానతలు లేని సమాజం కొరకు అక్షర యుద్ధం చేసిన మహాకవి గుర్రం జాషువా అని ప్రముఖ కవి, రచయిత సాగర్ల సత్తయ్య అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో MVN ట్రస్టు భవన్‌లో గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా, సాహిత్యం సామాజిక న్యాయం అనే అంశంపై KVPS ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా కనిగిరి SFI, DYFI ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు రక్తదాన శిబిరాన్ని గుత్తి శ్రీధర్ ప్రారంభించారు. శ్రీధర్ మాట్లాడుతూ.. యువత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని SFI, DYSF నాయకులను కోరారు. కాగా, 30మంది యువకులు రక్తదానం చేశారు.
KDP: పెద్ద చెప్పలిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సరఫరాతో సహా వివిధ ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా లభిస్తాయన్నారు. కాగా, ప్రజలు కొత్త విధానానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరాం రెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ ఇందులో భాగంగా సెప్టెంబర్ 29 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదుల వేదిక, ఉదయం 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
NLR: ఇసుక అక్రమ రవాణాపై వెంకటాచలం పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. మండలంలో ఇసుక అక్రమ తరలింపుపై సమాచారం తెలుసుకున్న సీఐ సుబ్బారావు.. అనుమతులు లేని వాహనాలను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను స్టేషన్ వద్ద ఉంచారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చండి హవనం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మోటూరి రాజుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
అన్నమయ్య: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ పోస్టర్లను ఇవాళ మదనపల్లె ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. కార్యకర్తల మనోభావాలకు పెద్దపీట వేస్తూ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ తీసుకొచ్చారన్నారు. అనంతరం వారికి అండగా ఆయన ఉంటారని భరోసా ఇచ్చారు.
RR: స్థానిక సంస్థల ఎన్నికలపై BRS పార్టీ జిల్లా పార్టీ సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి బాకీ కార్డులు విడుదల చేశారు.
SKLM: ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు అన్నారు. ఆదివారం సీఐటీయూ మండల మహాసభ మందసలో నిర్వహించారు. ముందుగా మెయిన్ రోడ్‌లో ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను యాజమాన్యాలు అమలు చేయడం లేదని, కార్మికులకు భద్రత లేకుండా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో జాషువా 130వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎంఆర్పీఎస్ నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి టీఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు బోయపల్లి నర్సింహులు, రాష్ట్ర అధ్యక్షులు సిరసనల్ల బాలరాజు మాదిగ, స్థానిక నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
NRML: స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపు ఖాయమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని ఒక గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేలా కలిసి పనిచేయాలన్నారు.
PPM: వైసీపీ కార్యకర్తలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా వెంటనే డిజిటల్ బుక్‌లో లాగిన్ అయి వివరాలు నమోదు చేస్తే పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు భరోసా ఇచ్చారు. పాలకొండ కార్యాలయంలో ఆదివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. అలాగే నాయకులు కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఉద్యమకారుడు భగత్ సింగ్ 118వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ వర్సిటీ అధ్యక్షులు కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి అఖిల్, నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.
VSP: విశాఖలో ప్రసిద్ధి చెందిన శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం కనకమలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. అర్చకులు పేకుజాము నుంచే అమ్మవారికి పూజలు నిర్వహించగా.. భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఈవో శోభారాణి తెలిపారు.