• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు పదోన్నతులు

ఏలూరు: జిల్లా ఐటీడీఏ కేఆర్ పురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 తెలుగు పండిట్స్, సుమారు 53 మంది ఉపాధ్యాయులకు ఎస్ఏ తెలుగు పండిట్స్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు వారికి పదోన్నతి ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. ఉపాధ్యాయులు తమ సేవలను గుర్తించినందుకు పీవోకు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 03:21 PM IST

కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు ఊరట

‘కాంతార’ సీన్ ఇమిటేషన్ వివాదంలో రణ్‌వీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారన్న కేసులో అతనిపై ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు రణ్‌వీర్ పూర్తిగా సహకరించాలని షరతు విధించింది. అజ్ఞానంతో చేసినా ఇలాంటి పనులు సరికాదని హితవు పలికింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.

February 24, 2026 / 03:21 PM IST

రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు

TG: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు డెడ్‌లైన్లు మారుతున్నాయి కానీ.. పూర్తి కావట్లేదని మండిపడ్డారు.

February 24, 2026 / 03:20 PM IST

ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం

SDPT: తోగుట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ స్థాయిలో మెరుగైన పాలనను అందించేందుకు వార్డు సభ్యులకు పలు రకాల పథకాలు, నియమాలు, గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ వంటి వాటిపై తరగతులు నిర్వహించారు.

February 24, 2026 / 03:20 PM IST

రెండవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

ATP: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. కనీస పనికి కనీస వేతనం అమలు చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 03:20 PM IST

‘ఏపీలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి’

AP: రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప శాంతిభద్రతలు లేవని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో శాంతిభద్రతలపై చర్చించాలని కోరితే అనవసరమైన విషయాలను ప్రస్తావించారని విమర్శించారు. ప్రధానిని జగన్ ఏరోజు అగౌరవపరచలేదని తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

February 24, 2026 / 03:19 PM IST

కర్ణాటక సీఎంను కలిసిన డిప్యూటీ సీఎం

KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 24, 2026 / 03:19 PM IST

పీఏసీఎస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ

NTR: నందిగామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా కొట్టె హరికృష్ణ, సభ్యులుగా ఘంటా వెంకట్రావు, మన్నెం వేణుగోపాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉండి విశిష్ట సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 03:18 PM IST

ఐటీఐ విద్యార్థులకు POCSO Actపై అవగాహన

TPT: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది వాకాడులో Government ITI College, SV High Schoolలో విద్యార్థులతో సమావేశమయ్యారు. Act (POCSO)పై వారికి అవగాహన కల్పించారు. చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. హెల్మెట్ ధరించడంపై ప్రాముఖ్యతను వివరించారు.

February 24, 2026 / 03:16 PM IST

సేవ్‌ పునర్విక.. ఆ చిన్నారి కోసం మంచు మనోజ్‌ పోస్ట్

చిన్నారి పునర్వికను కాపాడుకునేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఏకమై విరాళాలు సేకరిస్తుండటంపై నటుడు మంచు మనోజ్ స్పందించాడు. పాప పరిస్థితి తెలిసి తన హృదయం ముక్కలైందని, ఆమెకు పునర్జన్మ నివ్వాలని ఆకాంక్షించాడు. సాయం కోసం పీఎంఓ, ఇరు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం పాప ఆరోగ్యం దృష్ట్యా ఎవరూ కలవడానికి ప్రయత్నించవద్దని, ఆమె కోలుకుంటే అందరం గెలిచినట్లేనని మనోజ్ పేర్కొన్నాడు.

February 24, 2026 / 03:16 PM IST

అంగన్వాడీల దీక్షకు యూటీఎఫ్ మద్దతు

WG: ఆకివీడు సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు యూటీఎఫ్ ఆకివీడు శాఖ మంగళవారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ఆర్పీఎస్ నారాయణ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 24, 2026 / 03:15 PM IST

క‌నకమహాలక్ష్మి ఆలయంలో అష్టదళ పద్మారాధన

విశాఖపట్నం నగర దేవత క‌నకమహాలక్ష్మి అమ్మ‌వారి ఆల‌యంలో మంగళవారం అష్టదళ పద్మారాధన సేవను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగ్గురు ఉభయదాతలు పాల్గొని ప్రత్యేక నైవేద్యాలు, పుష్పార్చనలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ సేవలో ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 24, 2026 / 03:15 PM IST

‘జీసీసీ ద్వారా గిరిజనల పంటలు కొనాలి’

PPM: ఆదివాసి గిరిజనులు పండించే ఉత్పత్తులు కొండ శిఖరాలలో పండించే ఉత్పత్తులను జిసీసీ ద్వారా కొనుగోలు చేయాలని ట్రైబల్ రైట్స్ ఫారం జిల్లా అధ్యక్షుడు ఐ.రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. మన్యం జిల్లాలో గిరి శిఖర గ్రామాలలో గిరిజనులు పంటలను పండించుకుంటూ వారి జీవనాధారం సాగించుకుంటూ ఉంటున్నారన్నారు.

February 24, 2026 / 03:15 PM IST

పేదల గుడిసెల కూల్చివేత దుర్మార్గం: పువ్వాడ అజయ్

KMM: భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. పదేళ్లుగా నివాసం ఉంటున్న 600 కుటుంబాలపై పోలీసులు దాడి చేయడం దురదృష్టకరమన్నారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేసి, అర్హులైన పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

February 24, 2026 / 03:14 PM IST

‘తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి’

కడప: నగరంలోని ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో తాగునీటి సమస్యపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ఆర్‌ఓ ప్లాంట్ చెడిపోవడంతో 350 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో నీటి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమని, అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 03:14 PM IST