WGL: దుర్గ భవాని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు మాట్లాడారు. పసిడి పంటలతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ బాగుండాలని వారు కోరారు.
TG: 500 ఫార్చ్యూన్ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువు తీరాలన్నది తన స్వప్నమని సీఎం రేవంత్ అన్నారు. 70 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం మాట్లాడుకునేలా పనులు చేస్తామని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేవలం 80 ఫార్చ్యూన్ కంపెనీలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. చెన్నైకి బుల్లెట్ రైలు మార్గం వంటి అవకాశాలు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఉన్నాయని పేర్కొన్నారు.
CTR: చిత్తూరు నగర పరిధిలోని పూనేపల్లిలో ఆదివారం నూతన చర్చి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
CTR: రేబిస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమామహేశ్వరి అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా పశు వైద్యశాలలో అంతర్జాతీయ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి లక్షణాలు, జాగ్రత్తలపై పెంపుడు కుక్క యజమానులకు వివరించారు. అనంతరం జిల్లాకు 25 వేల రేబిస్ టీకాలు వచ్చాయని, ఎక్కడా టీకా కొరత లేదన్నారు.
ప్రకాశం: పామూరు మండలం కంబాలదిన్నెలో టీడీపీ నాయకులు ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా కనిగిరి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాస్, పామూరు మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి కోటపాటి జనార్దన్ పాల్గొన్నారు.
NGKL: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలని ఉద్దేశంతో పది జిల్లాలలో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
E.G: దసరా సందర్భంగా విజయవాడకు పాదయాత్రగా వెళ్లే భవాని భక్తులు తప్పనిసరిగా సర్వీస్ రోడ్లు వెంబడి వెళ్లాలని DSP జి.దేవకుమార్ ఆదివారం తెలిపారు. పుల్లలపాడులో సంభవించిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరం అని ఆయన అన్నారు. సాధ్యమైనంత వరకు భక్తులు రాత్రి పూట ప్రయాణం మానుకోవాలని కోరారు. తప్పనిసరిగా తమకు రేడియం స్టిక్కర్‌లను అతికించుకోవాలని భక్తులకు సూచించారు.
AKP: ఎస్ రాయవరం మండలం వైసీపీ అధ్యక్షుడుగా ఎస్ఏఎస్ మధువర్మ నియమితులయ్యారు. నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు సూచన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను నియమించినట్లు మధువర్మ ఆదివారం తెలిపారు. అలాగే ఉపాధ్యక్షులుగా వి. బంగారి,ఎం.రాజారావు,ప్రధాన కార్యదర్శులుగా కె శ్రీనివాస్,ఏ. నాగరాజును నియమించారు. కార్యదర్శులుగా సిహెచ్. అచ్యుతరావు నియమితులయ్యారు.
మేడ్చల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో జరుగుతున్న మన గుడి మన బలం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను గురుకుల అడ్వైజర్ నల్ల రాధాకృష్ణ కలిసి హాస్టల్ సప్లై దారుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, అశోక్, హరిబాబు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
TPT: వరల్డ్ రేబిస్ డే సందర్భంగా ఆదివారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ.. పెంపుడు జంతువులన్నిటికీ ఖచ్చితంగా రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. కుక్క కరిచినప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేసి వైద్యులను సంప్రదించాలన్నారు.
GDWL: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రేపు అలంపూర్‌కు రానున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి రానున్నారు.
ATP: అనంతపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జెండా త్యాగం, సేవ, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అని అన్నారు. ప్రజలకు చేరువై సేవ చేయడం ప్రతి నాయకుడు, కార్యకర్త ధ్యేయమై ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
RR: మహేశ్వరం పరిధిలోని మీర్ఖాన్ పేట వద్ద తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేడు రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు- 1 ఆమనగల్లు రీజినల్ రింగ్ రోడ్డు వరకు నిర్మాణం జరుగుతుందని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
KNR: తెలంగాణ భాష నేపథ్యంలో రూపొందించే ఏ సాహిత్య ప్రక్రియ అయినా తెలంగాణ ప్రజల్లో గుండెల్లో చిరకాల నిలిచిపోయే ఆత్మీయతను కలిగి ఉంటుందని సంక్షేమ అధికారి సరస్వతి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక భగవతి పాఠశాలలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతోజు పద్మశ్రీ రచించిన ‘బతుకమ్మ పాటల పల్లకి’ గ్రంథావిష్కరణ సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.