NLR: జిల్లాలో యూరియా కొరతను అధిగమించేందుకు కలెక్టర్ హిమాన్స్ శుక్లా ఆదేశానుసారం వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఎకరం వరిసాగుకు 135 కేజీలు(మూడు బస్తాలు) చొప్పున అందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రతి రైతుకు ప్రత్యేక కార్డు ఇవ్వనున్నారు. ఒకేసారి కాకుండా 10 రోజుల వ్యవధిలో మూడు విడతలుగా ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణ నూతన సీఐగా హరినాథ్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
AKP: రైతులకు సకాలంలో తక్కువ వడ్డీకి పంట రుణాలు అందించనున్నట్లు నక్కపల్లి పీఏసీఎస్ ఛైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి అన్నారు. ఇవాళ స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంమంత్రి వంగలపూడి అనిత సహాయ సహకారంతో సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
RR: SDNR నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి. జడ్పీటీసీ స్థానాలకు కొత్తూరు ఎస్టీ జనరల్, ఫరూఖ్ నగర్ ఎస్టీ మహిళ, కేశంపేట బీసీ మహిళ, కొందుర్గు బీసీ జనరల్, చౌదరిగూడ జనరల్, నందిగామ జనరల్ స్థానాలు రిజర్వు అయ్యాయి. అదే విధంగా MPP స్థానాలు కొత్తూరు మహిళ, ఫరూఖ్ నగర్ ఎస్టీ జనరల్, కొందుర్గు బీసీ జనరల్, కేశంపేట BC మహిళ, నందిగామ జనరల్, చౌదరిగూడ BC జనరల్‌గా కేటాయించారు.
తమిళనాడులో తొక్కిసలాట ఘటన సమయంలో పవర్ కట్ వివాదాస్పదంగా మారింది. తమ నాయకుడు విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ కోరిందని తమిళనాడు విద్యుత్ బోర్డు తెలిపింది. ఈ మేరకు టీవీకే నాయకులు లేఖ ఇచ్చారని చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధృవీకరించారు. అయితే, కావాలనే పవర్ కట్ చేశారని టీవీకే ఆరోపిస్తోంది.
PDPL: రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందని ఎంపీ గడ్డం వంశీ తెలిపారు. రూ.2.46 కోట్లతో 2.1 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, పర్యాటకులు సులభంగా, సురక్షితంగా కొండపై చేరుతారని వెల్లడించారు. రామగిరి పరిసరాల అభివృద్ధికి మరో 2.5 కోట్లు కేటాయించి, ఖిల్లాను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తించనున్నారు.
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాములు పామిడి మండలం కళాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, గ్రామస్తులు సోమవారం ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
NLG: కనగల్ మండల దర్వేశిపురం శ్రీ యల్లమ్మ అమ్మవారి సన్నిధిలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సరస్వతి పూజ నిర్వహించారు. శ్రీ సరస్వతి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న చిన్నారులకు ఆమూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయం తరపున పలకలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ చిదేటి వెంకట రెడ్డి, డైరెక్టర్లు, ఈవో అంబటి నాగిరెడ్డి పాల్గొన్నారు.
SRCL: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కూయడంతో చందుర్తిలో శంకుస్థాపన చేసిన వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాలకు అధికారులు ఇవాళ ముసుగులు వేశారు. అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని గ్రామస్థాయిలో కోడ్ నియమ నిబంధనల్లో ఉన్న వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలోని శిలాఫలకాలకు సిబ్బందితో అధికారులు ముసుగులు వేయించారు.
కామారెడ్డి జిల్లాలోని దేవున్ పల్లి PHC లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా సోమవారం రోజున 8 మంది స్పెషలిస్ట్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారీ డా.జోహా తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీల సమస్యలకు సంబంధించిన చికిత్సలకు పరీక్షించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పోలీస్ కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వరు గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇదే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏ.మహేందర్‌ను పోలీస్ కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్‌గ...
SRD: స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల అధికారులు సమాయత్తం కావాలని ఎంపీడీవో సత్తయ్య సూచించారు. సోమవారం కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో మాట్లాడారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను ఆచరణలో పెట్టీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రహీమోద్దిన్, శిక్షకులు కిఫాయత్ అలీ, సంగ్‌శెట్టి ఉన్నారు.
NLG: మహిళా సంఘాలకు చీరల పంపిణీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి రోజున చీరలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 3,66,955 మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వీరందరికీ చీరలు ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు.
కోనసీమ: అయినవిల్లి మండలం క్రాప గ్రామ పంచాయతీ వద్ద పీహెచ్సీ వైద్యులు డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు క్యాన్సర్ నిర్ధారిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం గురించి వివరించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజు సోమవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీ మహాసరస్వతీ (మహా గౌరి) అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ముగ్గురమ్మలను వివిధ రకాల పూలతో అందంగా అలకరించారు. వర్ణాశోబితా పూలతో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.