AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. డిజిటల్ బుక్‌లో దౌర్జన్యాలకు, వేధింపులకు పాల్పడే వారి పేర్లతో పాటు బాధితుల వివరాలు పొందుపరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు ఏకశివ పాల్గొన్నారు.
BPT: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పరాకాష్టకు చేరాయని సంతమాగులూరు మండల వైసీపీ కన్వీనర్ నాగేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం సంతమాగులూరులో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టారన్నారు.
GNTR: సినిమా ఇండస్ట్రీ విషయంలో బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి నిదర్శనమని మంగళవారం తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సినిమా పరిశ్రమకు YS జగన్ మంచి చేయాలని చూసారని, చిరంజీవి కూడా ఎంతో హుందాగా వ్యవహరించారని చెప్పారు. కాలానికి మెమరీ పవర్ ఎక్కువ అని, అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు.
MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కొలువుదీరిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం వేకువ జామున అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన సహస్రనామావళి నిర్వహించినట్లు ఆలయ ఈఓ రంగారావు తెలిపారు. దసరా సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు దీంతో ఆలయంలో సందడి నెలకొంది.
BDK: దమ్మపేట మండలంలో మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దేవి శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ నూతన ఛైర్మన్‌గా రేగుల్ల సత్య నారాయణ ఎన్నికయ్యారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల ఆధ్వర్యంలో మంగళవారం ఛైర్మన్‌తో పాటు నారాయణ రెడ్డి, రమణ, భోజన్న, చిట్యాల నవీన్ డైరెక్టర్‌లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయాభివృద్ధికి దుకాణ సముదాయాల కిరాయిలు వినియోగించాలని ఇన్స్పెక్టర్ సూచించారు.
SS: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో మంగళవారం ఆయుధపూజను నిర్వహించారు. సాయికుల్వంత సభామండపంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం బంగారు రథం, సత్యసాయి వినియోగించిన కార్లను ప్రత్యేకంగా అలంకరించి ట్రస్టు సభ్యులు, ఆర్‌జే రత్నాకర్ తదితరులు ఆయుధ పూజను నిర్వహించారు.
NLR: నెల్లూరు సంతపేట పాత వస్త్రాల మార్కెట్‌లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి దుకాణాలు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం వైసీపీ నేత, MLC చంద్రశేఖర్ రెడ్డి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని దీనిపై కలెక్టర్‌ను కలుస్తామని తెలిపారు.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావటం కలకలం రేపింది. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు దుండగులు బెదిరించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీని విధించి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. విమానంలోని 200 మంది ప్రయాణికులను దించి సోదాలు చేయగా.. పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
SKLM: కొత్తకుంకాం, కొండకుంకాం గ్రామాల్లో పలు చెరువుల గర్భాలను చదును చేసి మొక్కజొన్న, సరుగుడు, నీలగిరి మొక్కల పెంపకం చేపడుతున్నారు. వర్షాధారంపైనే సాగు చేసే ఈ ప్రాంత రైతులు, చెరువుల్లో నీటిని ఆయకట్టుకు మళ్లించి వరి, మొక్కజొన్న పంటలు పండించేవారు. ఒకప్పుడు నీటితో కళకళలాడే చెరువులు ఆక్రమణదారుల చెరలో పడి నేడు వెలవెలబోతున్నాయి.
ASR: గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం డుంబ్రిగూడ మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఎస్సై పాపినాయుడుతో కలిసి కోసంగి గ్రామంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు.
అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ మంగళవారం ఫిర్యాదు చేశారు. మదనపల్లెలో మాదకద్రవ్యాల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న వ్యాపారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
HNK: గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధి అసంపర్తి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన సరోజన సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట MLA కె.ఆర్ నాగరాజు మంగళవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన జమ్మి గద్దెను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పరిశీలించారు. దసరా నేపథ్యంలో పట్టణ శివారులో జమ్మి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో మంగళవారం జమ్మి గద్దెను కమిషనర్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. దసరా పండుగ నిర్వహించుకున్న ప్రజలు సాయంత్రం వేళ జమ్మి చెట్టుకు వచ్చి జమ్మి ఆకులను ఇస్తారన్నారు.
అన్నమయ్య: చిన్నమండెం కస్పాలో కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన బోరు వేయించి, మోటార్ అమర్చి నీటిని విడుదల చేశారు. ప్రజల కోరిక మేరకు తక్షణ చర్యలు తీసుకున్నామని, ప్రతి గ్రామంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.