సత్యసాయి: సోమందేపల్లి మండలంలో పవిత్ర రంజాన్ మాసంలో రెండవ రోజు ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. సోమందేపల్లిలోని జామియా మజీద్లో శుక్రవారం సహెరీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉపవాస దీక్షను ప్రారంభించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు పెంపొందించుకోవాలని మత పెద్దలు సూచించారు.