• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

GST వసూళ్లలో సంచలనం

సెప్టెంబర్ 2025లో GST వసూళ్లు రూ.1.89 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ.1.73 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాదికి 9.1 శాతం పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో నెల GST వసూళ్లు రూ.1.80 లక్షల కోట్లను దాటింది. GST సంస్కరణలు దేశీయ డిమాండ్‌ను పెంచుతాయని, దీంతో GDP వృద్ధికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.

October 1, 2025 / 07:25 PM IST

‘ప్రజాసంక్షేమం కోసమే పథకాల అమలు’

NZB: ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన 44 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

October 1, 2025 / 07:25 PM IST

భద్రాద్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విజయదశమి పండుగ అనేది ప్రజలు అత్యంత భక్తి , శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పర్వదినమని, ఇది చెడు‌పై ధర్మం గెలిచిన శుభసూచకమని ఆయన తెలిపారు.

October 1, 2025 / 07:24 PM IST

ఉప్పల్ మార్గంలో కొనసాగుతున్న రోడ్డు పనులు..!

మేడ్చల్: ఉప్పల్ నుంచి మేడిపల్లి, నారపల్లి నుంచి ఉప్పల్ వైపు వెళ్లే మార్గాలలో వరంగల్ జాతీయ హైవే పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల ముందస్తుగా రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు పనుల్లో గత నాలుగు రోజుల్లో వేగం పెరిగినట్లుగా స్థానిక ఏఈ నరేందర్ వివరించారు.

October 1, 2025 / 07:24 PM IST

కలెక్టర్‌ని కలిసిన ఎమ్మెల్యే

PPM: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనను కలసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు పథకాలను కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. పట్టణం సమగ్ర అభివృద్ధికి పలు అంశాలను కలెక్టర్ ముందు ఉంచారు.

October 1, 2025 / 07:23 PM IST

‘అడ్మిషన్లకు ఏ సర్టిఫికెట్ అవసరం లేదు’

PPM: జిల్లాలోని ప్రతి విద్యార్థి డిగ్రీ పూర్తి చేయాలని, డిగ్రీ లేకుండా ఎవరు ఉండకూడదని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్ది విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. అడ్మిషన్స్ కొరకు ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదని, అపార్ ఐడీ, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ఉంటేచాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. కలెక్టర్ విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

October 1, 2025 / 07:22 PM IST

కాళికాదేవి ఆలయంలో చండీ హోమం

కామారెడ్డి జిల్లాలోనీ మద్నూర్ మండల కేంద్రంలోనీ కాళికా దేవి ఆలయంలో బుధవారం కాళిక దేవి అమ్మ వారి ఆలయంలో చండి హోమం, అన్నదానం చేయడం జరిగింది. విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని విశ్వబ్రాహ్మణులు తెలిపారు. ఈ చండీ హోమం కార్యక్రమంలో రఘు దంపతులు పాల్గొన్నారు.

October 1, 2025 / 07:21 PM IST

‘సేవా భావంతో వైద్య సేవలందించాలి’

PPM: వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జగన్నాధపురం యూపీహెచ్సీలో నిర్వహించిన అవగాహన సదస్సులో బుధవారం ఆయన పాల్గొన్నారు. వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య సిబ్బంది ఆరోగ్య తనిఖీలు చేపట్టారు. వారితో మాట్లాడి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

October 1, 2025 / 07:20 PM IST

బ్రహ్మోత్సవాల్లో రూ.9.41 కోట్లతో అభివృద్ధి పనులు

TPT: తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ.9.41 కోట్లతో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టినట్లు సీఈ సత్యనారాయణ తెలిపారు. కాగా, కాటేజీలు, విశ్రాంతి సముదాయాల మరమ్మతులు, మాడ వీధుల్లో భజన మండపాలు, పుష్కరిణి, క్యూలైన్లు, ఘాట్ రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ ప్రదేశాల అభివృద్ధి చేశారు.

October 1, 2025 / 07:19 PM IST

నిత్యవసర సరుకులు పంపిణీ

ELR: వరదల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతిన్న గ్రామాలలోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఇంఛార్జ్ ఆర్డీవో ఎం.ముక్కంటి చెప్పారు. వేలేరుపాడు మండలం 24 గ్రామాలోని 2511 కుటుంబాలకు 94.16 క్వింటాళ్ల కూరగాయలు నిత్యవసర సరుకులు అందించారు. కుక్కునూరు మండలం 4 గ్రామాలలోని 563 కుటుంబాలకు 21.12 క్వింటాళ్ల కూరగాయలను అందించామన్నారు.

October 1, 2025 / 07:19 PM IST

51 రకాల నైవేద్యాలతో అమ్మవారికి సారె

VZM: విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం 51 రకాల నైవేద్యాలతో మహా గౌరి అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ అర్చకులు సోమశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి, ఈవోలు పద్మావతీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

October 1, 2025 / 07:19 PM IST

వీల్ చైర్లు పంపిణీ చేసిన సీపీ

HYD: సిటీ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్, IPS బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నేడు బంజారాహిల్స్‌ ఐసీసీసీ కేంద్రంలో ఉచిత వీల్‌చైర్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వికలాంగుల నెట్‌వర్క్, ఫ్రీడమ్ అసోసియేషన్, ట్రిపుల్ ఆర్ ఫౌండేషన్, NAMC ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ సజ్జనార్ హాజరై వీల్‌చైర్‌ల పంపిణీ చేశారు.

October 1, 2025 / 07:19 PM IST

ఐదేళ్లూ నేనే సీఎం: సిద్దరామయ్య

ఐదేళ్ల పదవి కాలానికి తానే కర్ణాటక సీఎంగా కొనసాగుతానని సిద్దరామయ్య మరోసారి స్పష్టం చేశారు. దసరా పండగను పురస్కరించుకుని మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన ఆయన వచ్చే దసరాకీ తానే పుష్పార్చన చేస్తానని తెలిపారు. ఆయన సీఎం పదవి చేపట్టి వచ్చే నెలకు రెండున్నరేళ్లు పూర్తి కానుండటంతో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

October 1, 2025 / 07:18 PM IST

‘అభాగ్యులకు జీవిత భరోసా’

VZM: మెరకముడిదాం మండలం గర్భాం పంచాయతీలో బుధవారం అక్టోబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీలో MLA కళా వెంకట రావు పాల్గొన్నారు. స్వయంగా ప్రతి ఇంటికి తిరిగి అవ్వ తాతలకు, వికలాంగులకు, లబ్ధిదారులకు పెన్షన్‌ పంచారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి మహిళలు, విద్యార్థులతో ముచ్చటించారు.

October 1, 2025 / 07:16 PM IST

రాష్ట్ర సచివాలయంలో మంత్రి పూజలు

HYD: విజయదశమి పర్వదినం సందర్భంగా HYD డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌, క్యాంపు కార్యాలయంలో వాహన ఆయుధ పూజ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ అందరు ఘనంగా జరుపుకోవాలని కోరారు.

October 1, 2025 / 07:15 PM IST