GDWL: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులలో 50 శాతం నుంచి 300 శాతం వరకు టికెట్ రేట్లు పెంచి పేద ప్రజలను ఆర్టీసీ దోచుకుంటోందని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాట్లాడుతూ.. పాత బస్టాండ్ సైతం కొత్త బస్సులుగా మార్చి నడుపుతున్నారన్నారు.
JGL: సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఎదురుగట్ల సతీష్(32) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సతీష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, యువతిపై వాట్సాప్ గ్రూప్, ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు కర్రలతో దాడి చేసి సతీష్‌ను హతమార్చారు.
ఎన్టీఆర్: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తిరుపతి- గౌహతి(నం.07066) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రోజు రాత్రి 9.10 గంటలకు తిరుపతిలో బయలుదేరే ఈ ట్రైన్ రేపు సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుంటుందన్నారు. జనరల్, స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉండే ఈ ట్రైన్ ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.
ELR: కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో ఇవాళ K9 సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని K9 వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ASR: నర్సీపట్నం-కేడీపేట నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు సర్వీసును కొయ్యూరు మండలం రావణాపల్లి గ్రామం వరకూ పొడిగించారు. ఇటీవల టీడీపీ కొయ్యూరు మండల అధ్యక్షుడు కాకురి చంద్రరావు, పలువురు ప్రజలు ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ సియారి దొన్నుదొరను కలిసి నైట్ హాల్ట్ బస్సును పొడిగించాలని కోరారు. ఆయన ఆదేశాలతో రాత్రి బస్సు రావణాపల్లి గ్రామం వస్తుందని చంద్రరావు మీడియాకు తెలిపారు.
కృష్ణా: అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సందర్భంగా గుండె, కాన్సర్, నేత్ర వైద్య శిబిరం నిర్వహించి 650 మందికి ఉచిత వైద్యం చేశారు.
VSP: మాధవధార కనక మహాలక్ష్మి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల భాగంగా ఆదివారం అమ్మవారు మహా చండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన మహా చండీ దేవి అలంకారం అని ఆలయ ధర్మకర్త సనపల కీర్తి అన్నారు. మహాచండీ ఆలంకారం పూజ సాధకుని దుర్వ్యవస్థలు తొలగించి, జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందన్నారు.
KRNL: ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. మండల అధ్యక్షుడు వీరేష్, కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ.. భగత్ సింగ్ యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్న ప్రసాదం వితరణకు ఆదివారం పితానివారిపాలెం వాస్తవ్యులు బొంతు వెంకట సత్యనారాయణ, మీరమ్మ దంపతులు రూ. 80,116 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
HYD: మూసీ నదిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా అధికారులు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి మొత్తం 10,000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. నిన్న రాత్రి అత్యధికంగా 36,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో తగ్గడంతో అవుట్ ఫ్లోను నియంత్రణలోకి తీసుకొచ్చారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
E.G: ‘వరల్డ్ హార్ట్ డే’ సందర్భంగా రాజమండ్రిలో ‘వాక్ ఫర్ హార్ట్’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. గుండె జబ్బుల లక్షణాలు, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు పేర్కొన్నారు.
తమిళనాడు తొక్కిసలాట ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. గాయపడినవారు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
VKB: బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన ఎనుముల చంద్రమ్మ ఇల్లు కూలింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలినట్లు ఆమె తెలిపారు. తన ఇల్లు పాతది కావడంతో వర్షపు నీరు ఇంట్లోకి వచ్చి, నివాసానికి వీలులేకపోయిందని, భారీ వర్షానికి ఇల్లు కూలిపోయిందని చంద్రమ్మ తెలిపారు. ప్రభుత్వం తనని ఆదుకోవాలని కోరింది.
TG: బతుకమ్మ సంబరాల్లో భాగంగా బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ స్టేడియం-NTR స్టేడియం వరకు కొనసాగనున్న ఈ ర్యాలీని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. HYD విమెన్ బైకర్స్ సంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్‌లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. TN-PPDL చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది.