సత్యసాయి: పుట్టపర్తికి చేరుకున్న పీఎంశ్రీ పాఠశాలల కేంద్ర కమిషనర్ సచ్చిదానంద ప్రసాద్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జేసీ కేంద్ర కమిషనర్‌కు మొక్కను అందజేసి పర్యావరణ హితంగా స్వాగతం పలికారు.