• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇందిరాపార్క్ వద్ద RTC జేఏసీ ధర్నా

TG: HYDలోని ఇందిరాపార్క్ వద్ద RTC జేఏసీ ధర్నా చేపట్టింది. చలో సెక్రటేరియెట్‌కు పిలుపునిచ్చింది. RTCని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరింది. వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది.

February 24, 2026 / 04:37 PM IST

‘పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత’

HNK: పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బాల్య వివాహ విముక్తి అవగాహన ప్రచార రథాన్ని నేడు హన్మకొండలో ఎంపీ ప్రారంభించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.

February 24, 2026 / 04:37 PM IST

‘విశాఖను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం’

VSP: ఏపీ పర్యాటక రంగంలో విశాఖపట్నం జిల్లా కీర్తి కిరీటంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ శాసనసభలో ప్రకటించారు. విశాఖ పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి రూ.8,650 కోట్ల పెట్టుబడులతో 50 కీలక ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌లో విశాఖను గ్లోబల్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దురామన్నారు.

February 24, 2026 / 04:35 PM IST

గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులు

MLG: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ములుగు జిల్లా బీఆర్ఎస్ దళిత నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా గెలుపును జీర్ణించుకోలేక నిర్బంధాలకు పాల్పడటం హేయమని అన్నారు. కుళ్ళు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రీ శ్రీను, బియ్యం శ్రీను, బోడ ప్రసాద్, పాల్గొన్నారు.

February 24, 2026 / 04:35 PM IST

జాయింట్ కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులును మంగళవారం కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై పలు అంశాలపై చర్చించారు. మున్సిపల్ అభివృద్ధికి సహకారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

February 24, 2026 / 04:35 PM IST

సీఎంను కలిసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే

కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యత అంశాలపై ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, కాలువలు, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని సీఎంకి వివరించారు.

February 24, 2026 / 04:34 PM IST

తెలంగాణ ఉద్యమకారుని జలజకు ఘన నివాళులు

MHBD: జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెలంగాణ మలి విడత ఉద్యమకారిణి, రచయిత్రి జలజకు కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. జలజ చిత్రపటానికి డీ పీ ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, కళాకారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 04:34 PM IST

ఘనంగా ప్రమాణస్వీకార మహోత్సవం

KDP: రాజంపేట పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు, 41 మంది నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి 2న మదనపల్లె పట్టణంలోని రామతులసమ్మ కన్వెన్షన్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

February 24, 2026 / 04:33 PM IST

పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

MBNR: హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన, సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం SSC విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

February 24, 2026 / 04:33 PM IST

‘కులం పేరుతో విమర్శిస్తే సహించేది లేదు’

SDPT: కులం పేరుతో రాజకీయం చేస్తూ MP రఘునందన్ రావును విమర్శిస్తే ఊరుకునేది లేదని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీల స్వామి ముదిరాజ్, రాయపోల్ బీజేపీ మండల అధ్యక్షుడు మంకిడి స్వామి హెచ్చరించారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. కులం పేరుతో రాజకీయం చేస్తున్న నీలం మధు చరిత్ర ప్రజలందరికీ తెలుసని ధ్వజమెత్తారు.

February 24, 2026 / 04:32 PM IST

హైదరాబాద్‌కు తరలిన టీఎంయూ నాయకులు

KNR: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ పిలుపునిచ్చిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి కరీంనగర్ రీజియన్ టీఎంయూ నాయకులు భారీగా తరలివెళ్లారు. టీజీఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలను ఆపాలని, కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 04:32 PM IST

పల్నాడు జంట హత్యలపై సీఎంకు వినతి

PLD: జిల్లా చర్లగుడిపాడులో పద్మశాలి యువకుల జంట హత్యలపై సంఘం నేతలు సీఎం చంద్రబాబును కలిశారు. శ్రీనివాసరావు, భావనరుషి కుటుంబాలకు ఆర్థిక సాయం, పక్కా ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 04:32 PM IST

అసెంబ్లీలో రేపల్లె విద్యార్థులు

BPT: ఏపీ అసెంబ్లీ సమావేశాలను రేపల్లె నియోజకవర్గ విద్యార్థులు వీక్షించారు. పేటేరు, గుళ్లపల్లి, ఉల్లిపాలెం పాఠశాలల విద్యార్థులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ముచ్చటించారు. సభ తీరు, సమస్యల ప్రస్తావనపై వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. అనంతరం మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 04:31 PM IST

‘జిల్లాలో తాగునీటి ఎద్దడి రావొద్దు’

వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ప్రజలు ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఛైర్ పర్సన్ మాధవి రమేష్ అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని 33వ వార్డులో నూతన బోరు మోటర్ బిగించి వార్డు వాసులకు భరోసా కల్పించారు. బోరు మోటర్ నుంచి అంతర్గత పైప్‌లైన్‌లో బిగించి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలన్నారు.

February 24, 2026 / 04:30 PM IST

మాజీ ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే

MDK: నార్సింగి మండలం వల్లూర్‌లో మాజీ ఎంపీపీ చిందం సబిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ చిందం సబిత భర్త రవీందర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

February 24, 2026 / 04:30 PM IST