• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పశు వైద్యశాలలు ఆధునికరించాలి: ఎమ్మెల్యే

NLR: వ్యవసాయం తర్వాత లక్షలాది రైతు కుటుంబాలకు స్థిరమైన రోజువారీ ఆదాయం అందించే పాడి రంగాన్ని బలోపేతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి పరిశ్రమ రెండు కళ్ళుగా అభివర్ణించారు. పశు వైద్యశాలలు ఆధునికరించాలన్నారు.

February 24, 2026 / 01:26 PM IST

‘ఆదర్శ కుటుంబం’లో యోగిబాబు..?

విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో తమిళ కమెడియన్ యోగిబాబు భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనపై త్రివిక్రమ్ చాలా కామెడీ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 01:26 PM IST

కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉంది: MLA

GNTR: కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం అసెంబ్లీలో ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదంలో కల్తీ జరగడం యాదృచ్ఛికం కాదని, ఇది పక్కా ప్రణాళికతో చేసిన పని అని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమలలో జరిగిన అక్రమాలు బ్రిటిష్ పాలనకంటే దారుణంగా ఉన్నాయన్నారు.

February 24, 2026 / 01:25 PM IST

గోతులదొడ్డి సర్పంచ్ టీడీపీ పార్టీకి రాజీనామా..!

KRNL: గోతులదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, సర్పంచ్ లక్కీ హనుమంతమ్మ భర్త టీడీపీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు లక్కే గోవింద్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయినా గుర్తించకపోవడం చాలా బాధాకరమని వాపోతూ రాజినామా చేసినట్లు సమాచారం.

February 24, 2026 / 01:25 PM IST

FLASH: జిల్లాల్లో యూరియా బస్తాలు.. UPDATE

MDCL: ఫిబ్రవరి 24 వరకు యూరియా నిల్వల పై ఫెర్టిలైజర్ యాప్ తాజా సమాచారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,71,041 యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా వికారాబాద్‌లో 10,991 బ్యాగులు, రంగారెడ్డిలో 16,809 బ్యాగులు, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 8,263 బ్యాగులు నిల్వలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు అవసరమైన మేరకు బుక్ చేసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 01:25 PM IST

తప్పుడు రిజిస్ట్రేషన్ ఘటనలో ఆరుగురు అరెస్ట్

AKP: నాతవరం మండలం లింగంపేట గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా చూపిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలో కేసు నమోదు చేశామని సీఐ రేవతమ్మ తెలిపారు. కోటవురట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రెవెన్యూ, పంచాయతీ అధికారుల విచారణలో వెల్లడైందన్నారు. ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.

February 24, 2026 / 01:25 PM IST

కంచికచర్ల ప్రభుత్వ ఖాజీగా షేక్ అబ్దుల్ రషీద్

ఎన్టీఆర్: కంచికచర్ల మండల ప్రభుత్వ ఖాజీగా నియమితులైన షేక్ అబ్దుల్ రషీద్ మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీ నాయకులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన ఆయనకు ఆమె అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేయాలన్నారు.

February 24, 2026 / 01:23 PM IST

‘న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి’

కృష్ణా: చల్లపల్లి కేడీసీసీ బ్యాంకు వద్ధ సహకార సంఘ ఉద్యోగుల సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు చండ్ర రవి కుమార్, తోట కృష్ణారావు, కోసూరు రామాంజనేయులు, నియోజకవర్గ పరిధిలోని 37 సొసైటీల సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 01:23 PM IST

760 అక్రమ మద్యం సీసాలు ధ్వంసం

SKLM: 2022-2026 వరకు ఆమదాలవలస పోలీసులు పట్టుకున్న అక్రమ మద్యాన్ని మంగళవారం ఎక్సైజ్ శాఖ DSP పి.రామచంద్ర కుమార్, ఆమదాలవలస ఎస్సై బాలరాజు సమక్షంలో మొత్తం 760 మద్యం సీసాలను ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.1లక్షగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 01:23 PM IST

20 కోట్ల లడ్డూలు కల్తీ: సీఎం చంద్రబాబు

AP: బ్రిటీష్ పాలనలో కూడా వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లలేదని సీఎం చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీబీఐ సిట్ విచారణ కొనసాగిందన్నారు. సిట్ నివేదిక ప్రకారం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్‌ను అడ్డుకోవడానికి కూడా పిటిషన్ వేశారని చెప్పారు. సుప్రీం ఆ పిటిషన్‌ను కొట్టివేసిందన్నారు.

February 24, 2026 / 01:22 PM IST

రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఫెయిల్: మాజీ మంత్రి

E.G: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనిచేయట్లేదని, పూర్తిగా ఫెయిల్ అయిందని EX మంత్రి విడుదల రజిని విమర్శించారు. కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందని మండిపడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాలు స్వీకరించి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలన్నారు.

February 24, 2026 / 01:22 PM IST

GOOD NEWS: SBI లో 116 ఉద్యోగాలు

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిపుణులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 116 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హులైన వారు మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

February 24, 2026 / 01:22 PM IST

శరవేగంగా ప్రధాన రహదారి నిర్మాణం

కృష్ణా: ఘంటసాల మండలం పూషడం నుంచి మల్లాయి చిట్టూరు ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి పథకం నిధులతో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టారు. జరుగుతున్న పనులను పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్, సర్పంచ్ ఆవుల రేవతి, టీసీ అధ్యక్షులు నరసయ్య పరిశీలించారు.

February 24, 2026 / 01:20 PM IST

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జీఎం సంజయ్ కుమార్

HYD: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నేడు కాచిగూడ రైల్వే స్టేషన్ను అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎమ్ సంతోష్ కుమార్ వర్మ జనరల్ మేనేజర్‌కు తోడుగా ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై అధికారులు చర్చించారు.

February 24, 2026 / 01:20 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు

ప్రకాశం: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలనే లక్ష్యంతో పొన్నలూరులో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు సిబ్బందిని నియమించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

February 24, 2026 / 01:20 PM IST