AP: బ్రిటీష్ పాలనలో కూడా వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లలేదని సీఎం చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీబీఐ సిట్ విచారణ కొనసాగిందన్నారు. సిట్ నివేదిక ప్రకారం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్ను అడ్డుకోవడానికి కూడా పిటిషన్ వేశారని చెప్పారు. సుప్రీం ఆ పిటిషన్ను కొట్టివేసిందన్నారు.