• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏల్చూరులో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం వాయిదా

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరగాల్సిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం శనివారానికి వాయిదా పడింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అత్యవసర క్యాబినెట్ సమావేశం ఉండటంతో ఈ మార్పు చేసినట్లు స్థానిక టీడీపీ నాయకులు మంగళవారం వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని వారు కోరారు.

February 24, 2026 / 11:38 AM IST

నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: సర్పంచ్

NZB: రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గడ్కోల్ GP పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ సండ్ర లతా శంకర్, ఉప సర్పంచ్ రొక్కం సంపత్ రెడ్డి తెలిపారు. సిరికొండలోని గడ్కోల్గ్ గ్రామంలో నూతనంగా బోరు బావి తవ్వకం పనులను ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

February 24, 2026 / 11:37 AM IST

నిబంధనలు మార్చిందెవరు?: ధూళిపాళ్ల

AP: కఠినతర నిబంధనలు మార్చిందెవరు? బోర్డు మార్చినప్పుడు ఛైర్మన్‌గా ఉన్నది వైవీ సుబ్బారెడ్డి కాదా అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. రోజుకు 4 లక్షల లీటర్ల సామర్థ్యం నిబంధనను తీసేశారని, రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.150 కోట్లకు తీసుకొచ్చారన్నారు. డెయిరీ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి తీసుకొచ్చారని, తమకు కావాల్సిన వ్యాపారులకు టెండర్లు ఇవ్వడానికే అన్నారు.

February 24, 2026 / 11:37 AM IST

కొండగట్టులో భక్తుల సందడి

JGL: ప్రముఖ పుణ్య క్షేత్రం మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. దీంతో ఉప ఆలయాలైన బేతాళ, రామాలయ ఆలయాల్లోను భక్తుల సందడి నెలకొంది.

February 24, 2026 / 11:36 AM IST

ఇసుక డంపును సీజ్ చేసిన అధికారులు

MDK: చిలిపిచేడ్ మండలంలోని అజ్జమరి, గంగారం గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. తహసీల్దార్ సహదేవ్, ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో గంగారంలో 12, అజ్జమరిలో 16 డంపులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఇసుకను ఎవరైనా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

February 24, 2026 / 11:34 AM IST

మక్తల్-నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణ

NRPT: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ కోసం క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. మొదటి, రెండో దశ ప్రాజెక్టులకు, డిస్ట్రిబ్యూటర్ల భూ సేకరణకు రూ.1,275 కోట్లు కేటాయించనుంది. మంత్రివర్గ ఆమోదంతో పథకం పనుల్లో వేగం పెరుగుతుందని అంచనా.

February 24, 2026 / 11:34 AM IST

‘అసెంబ్లీలో ఏకపక్ష చర్చ నుంచి పారిపోతున్నారు’

BPT: తిరుమల లడ్డూ, హెరిటేజ్ అంశాలపై శాసన మండలిలో చర్చించేందుకు సీఎం చంద్రబాబు సాహసం చేయలేకపోయారని మంగళవారం బాపట్ల వైసీపీ ఇంఛార్జ్ మేరుగ నాగార్జున ఆరోపించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను వరుసగా తిరస్కరిస్తూ కూటమి నేతలు చర్చ నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఏకపక్షంగా చర్చించి ఈ వ్యవహారాన్ని ముగించాలనుకోవడం పిరికిపంద చర్య అన్నారు.

February 24, 2026 / 11:34 AM IST

కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంపై ఫోకస్

HYDలో పలు కీలక కేసులలో దర్యాప్తును మరింత వేగవంతం చేయడంపై CP సజ్జనార్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. దర్యాప్తులో ఈ భాగం అత్యంత కీలకంగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ విభాగానికి కమిషనర్ నలుగురు అధికారులను కేటాయించారు.

February 24, 2026 / 11:33 AM IST

ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ట్వీట్

AP: ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ట్వీట్ చేశారు. కావాలనే తనను కేసులో ఇరికించారని, ఎస్టీగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. మాజీ సీఎం, పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడు తనకు ఫోన్ చేసి బెదిరించాడని, తన దగ్గర కాల్ రికార్డులు ఉన్నాయన్నారు. సరైన సమయంలో ఆధారాలు బయటపెడతా, RRR కాల్ డేటా బయటకు తీస్తే  ఎంతమందిని బెదిరించారో తెలుస్తుందన్నారు.

February 24, 2026 / 11:33 AM IST

జాతర మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

BDK: పినపాక మండలంలోని అమరారం గ్రామంలో జరగనున్న శ్రీ నాగులమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా జాతర కమిటీ సభ్యులు ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహించబడనున్న ఈ జాతర కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

February 24, 2026 / 11:32 AM IST

పేద యువతి వివాహానికి కేశవరెడ్డి ఆర్థిక సాయం

ATP: గార్లదిన్నె మండలం ఎగువపల్లికి చెందిన చంద్రశేఖర్ కుమార్తె సాయి దుర్గ వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మంగళవారం ఉదయం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని ఆయన తెలిపారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

February 24, 2026 / 11:31 AM IST

కోఠి SBI ఏటీఎం వద్ద కాల్పులు.. చేధించిన పోలీసులు

HYD: కోఠి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జనవరి 31న కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పరార్ అవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చివరకు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

February 24, 2026 / 11:30 AM IST

నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే

NDL: వెలగపూడి క్యాంప్ కార్యాలయంలో హెచ్‌ఆర్‌డీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రసాద కిట్‌ను ఎమ్మెల్యే లోకేష్‌కు అందజేశారు.

February 24, 2026 / 11:30 AM IST

చట్టాలపై వార్డు సభ్యులకు అవగాహన

MNCL: గ్రామాలలో సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు కృషి చేయాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ సూచించారు. జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టంలోని అంశాల గురించి శిక్షకులు వారికి వివరించారు. మౌలిక సౌకర్యాల కల్పన, సమస్యల పరిష్కారం వంటివి వివరించారు.

February 24, 2026 / 11:30 AM IST

నామినేటేడ్ పదవుల భర్తీపై నాయకుల ఆశలు

KNR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అయినప్పటికీ నేటికి జిల్లాల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పార్టీ క్యాడర్‌లో నిరాశ నెలకొంది. అయితే మార్చిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని అనడంతో నాయకుల ఆశలు చిగురించాయి. పార్టీ పదవులు, మార్కెట్ కమిటీ, గ్రంథాలయాల ఛైర్మన్ వంటివి చాలా చోట్ల పెండింగ్‌లో ఉండటంతో ఎవరికి వస్తాయనేది ఆసక్తి నెలకొంది.

February 24, 2026 / 11:28 AM IST