AP: ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ట్వీట్ చేశారు. కావాలనే తనను కేసులో ఇరికించారని, ఎస్టీగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. మాజీ సీఎం, పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడు తనకు ఫోన్ చేసి బెదిరించాడని, తన దగ్గర కాల్ రికార్డులు ఉన్నాయన్నారు. సరైన సమయంలో ఆధారాలు బయటపెడతా, RRR కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తుందన్నారు.