అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా అశ్వవాహనం పై పారువేటకు స్వామివారు బయలుదేరగా, దేవస్థానం నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. కోలాటాలు, మేళతాళాలు, డప్పులతో పారువేట ఉత్సవం సందడిగా జరిగింది. కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
KDP: వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ఎస్సై తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ మోసాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్‌పై 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం షష్ఠి: ఉ.10-03 తదుపరి సప్తమి; భరణి: సా.5-33 తదుపరి కృతిక; వర్జ్యం: తె.4-45 నుంచి 6-14 వరకు; దుర్ముహూర్తం: మ.12-36 నుంచి 1-22 వరకు, తిరిగి 2-55 నుంచి 3-41 వరకు; రాహుకాలం: ఉ.7-30 నుంచి 9 వరకు; సూర్యోదయం: ఉ.6.27; సూర్యాస్తమయం: సా6 గంటలకు.
వ్యాపారవేత్త, తమిళ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణన్ హత్యకు గురయ్యారు. TN దిండిగల్ జిల్లాలో నారాయణన్‌కు ఓ గెస్ట్ హౌస్ ఉండగా.. 2 రోజుల క్రితమే అందులో అద్దెకు చేరిన ఐదుగురు యువకులు ఆయనను చంపేసి భారీ మొత్తంలో నగదు, నగలతో పరారయ్యారు. CC TV ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా విష్ణుప్రియ తమిళ సినిమా ‘మాయావి(2005)’లో సూర్యతో కలిసి నటించింది.
అఫ్గనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో పాక్ ఈ దాడులకు పాల్పడటం, ఇందులో మహిళలు, చిన్నారులు సహా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇది తమ అంతర్గత వైఫల్యాలను ఇతరులపై రుద్దేందుకు పాక్ చేసిన ప్రయత్నమేనన్నారు.
➢ 1483: మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం➢ 1503: పదకవితా పితామహుదు అన్నమయ్య మరణం➢ 1931: సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు నూజిళ్ల లక్ష్మీనరసింహం జననం➢ 1957: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జననం➢ 1967: ఇండో-అమెరికన్ న్యాయవేత్త శ్రీ శ్రీనివాస్ జననం➢ ప్రపంచ ఇంద్రజాలికుల(మెజీషియన్స్) దినోత్సవం
ప్రధాని మోదీ ఈ నెల 25న ఇజ్రాయెల్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కోసం జెరూసలేంలో ఎదురుచూస్తున్నట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ బంధం ఇద్దరు ప్రపంచ నాయకుల శక్తిమంతమైన కూటమి అని అభిప్రాయపడ్డారు. తాము ఇన్నోవేషన్, రక్షణ, వ్యూహాత్మక దార్శనికతలో భాగస్వామ్యులమని.. ఉన్నత శిఖరాలకు చేరేందుకు AI మొదలు ప్రాంతీయ సహకారం వరకు తమ బంధం ఇలాగే ఉంటుదన్నారు.
తాము పెళ్లి చేసుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన స్వయంగా ప్రకటించారు. అభిమానులను ఉద్దేశించి ఒకే తరహా నోట్‌ను ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేశారు. ‘ప్లాన్ చేయడానికి ముందే మీరు ప్రేమతో మాకు VIROSH అని పేరు పెట్టారు. మీ అభిమానానికి గుర్తుగా మా వేడుకను THE WEDDING OF VIROSH పేరిట నిర్వహించాలని అనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అత్యధికంగా 18* వరుస T20ల్లో కనీసం ఓ వికెట్ పడగొట్టిన భారత ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ అర్ష్‌దీప్(2024-25 మధ్యకాలంలో 17 T20లు) పేరిట ఉండేది. ఆశిష్ నెహ్రా(2016లో 13), వాషింగ్టన్ సుందర్(2024-25లో 11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
TG: ప్రజలు నమ్మి ఓటేశారని, కుర్చీలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని.. ఆ తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరఫున పేదవాళ్లకు సేవ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచులో భారత్ ఘోరంగా ఓడింది. 188 పరుగుల లక్ష్యఛేదనలో దూబే(42) మినహా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 111 పరుగులకే పరిమితమై 76 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బౌలర్లలో యాన్సెన్ 4, మహారాజ్ 3, బాష్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా గత టోర్నీ మొదలు చివరి 14 T20 WC మ్యాచుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు ఇదే తొలి ఓటమి.
‘జై బోలో తెలంగాణ’ మూవీ షూటింగ్ విశేషాలను జగపతి బాబు తాజాగా పంచుకున్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌లో షూటింగ్ ఉద్రిక్తంగా ఉండటంతో, తండ్రి వద్దన్నా మొండిగా వెళ్లానని చెప్పారు. రక్షణ కోసం తన వద్ద గన్ ఉంచుకున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చారు. ఆ సినిమా చేసినందుకు ఆంధ్రాలో కొందరు బాధపడినా, వరంగల్ ప్రజలు తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.
T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఓటమి అంచున నిలిచింది. ప్రొటీస్ విసిరిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. తొలి నుంచి బ్యాటర్లు తడబడ్డారు. ఈ క్రమంలో మహారాజ్ వేసిన 15 ఓవర్‌లో హార్దిక్(18), రింకూ(0), ఆర్ష్‌దీప్(10) వెంటవెంటనే వెనుదిరిగారు. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి స్కోర్ 88/8 కాగా దూబే(19), వరుణ్(0) క్రీజులో ఉన్నారు.
TG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న ఘటనపై ఓ సామాజిక కార్యకర్త జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మర్రిగూడ మండలం కమ్మగూడెం గ్రామానికి చెందిన వినోద్ హిందుస్థానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల కుల దురహంకారం వల్లే జాతరలో ఈ విషాదం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.
SKLM: పలాస మండలం మహాదేవిపురంలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్‌పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్‌ఫోన్‌లో నారి శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.