• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బాణాసంచా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి’

ATP: బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ, ఈ ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

February 28, 2026 / 05:00 PM IST

హుటాహుటిన బయలుదేరిన హోం మంత్రి అనిత

VZM: కాకినాడ జిల్లా వేట్లపాలెం లో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి సుమారు 20 మంది సజీవ దహనం ఆయన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలానికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.

February 28, 2026 / 05:00 PM IST

టైలర్స్ డే వేడుకలలో పాల్గొన్న బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పర్యటించారు. మండల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె మండలంలోని టైలర్లకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె అన్నారు.

February 28, 2026 / 05:00 PM IST

పార్వతీపురంలో పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన

PPM: పార్వతీపురంలో జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జిఎస్టి కమిషనర్ పి. ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. జీఎస్టీ కమిషనర్‌గా దేశవ్యాప్తంగా సేవలందించిన ఆనందకుమార్ రాష్ట్రానికి అనేక పథకాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

February 28, 2026 / 05:00 PM IST

‘రిమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

ADB: ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. శనివారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ కమిటీని డైరెక్టర్‌కు పరిచయం చేశారు.

February 28, 2026 / 05:00 PM IST

‘జనసేన సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి’

SKLM: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ను వేగవంతం చేయాలి అని జిల్లా జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త కె .రవికుమార్ అన్నారు. శనివారం నరసన్నపేటలో జరిగిన జనసేన క్రియాశీలక నమోదు ప్రక్రియలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి లో విస్తరించాలని కోరారు.

February 28, 2026 / 05:00 PM IST

గ్రంథాలయ భవనాల కేటాయింపుపై కలెక్టర్‌కు విన‌తి

విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డి సతీష్ కుమార్ శనివారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ కార్యాలయాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో శాశ్వత భవనాలు కేటాయించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. అలాగే జీవీఎంసీ చెల్లించాల్సిన రూ.200 కోట్లకు పైగా లైబ్రరీ సెస్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.

February 28, 2026 / 05:00 PM IST

ఎమ్మెల్యే చొరవతో చేతిపంపు బోర్లుకు మరమ్మతులు

NLR: కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మరమ్మతులకు గురైన చేతిపంపు బోర్లుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. శనివారం కాలనీలో ఉన్న మూడు బోర్లను అధికారులు గుర్తించి రిపేరు చేశారు. వేసవికాలం తాగునీటి ఎద్దడి తలెత్తుకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ బోర్లు రిపేరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

February 28, 2026 / 05:00 PM IST

‘మంజూరైన పనులను ప్రారంభించాలి’

AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్ 82వ వార్డు పరిధిలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని కార్పొరేటర్ ఎం సునీత విజ్ఞప్తి చేశారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దోమలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల తొలగించిన మలేరియా సిబ్బందిని తిరిగి నియమించాలన్నారు. స్మశాన వాటికలో చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు.

February 28, 2026 / 05:00 PM IST

పెదకాకానిలో స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

GNTR: పెదకాకాని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు నూతనంగా మంజూరైన 14 స్పౌజ్ (విడో) పెన్షన్లను పంపిణీ చేశారు. పెదకాకాని, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, కొప్పురావూరు, వెనిగండ్ల గ్రామాల లబ్ధిదారులకు మండల ఎంపీపీతో పాటు, కూటమి నాయకులు పెన్షన్లు అందజేశారు.

February 28, 2026 / 04:59 PM IST

గలిజేరుగుళ్లలో శనగలు, కందులు కొనుగోలు ప్రారంభం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల గ్రామంలో శనివారం కందులు, శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ పాల్గొని మాట్లాడారు. కందులు ప్రభుత్వం మద్దతు ధర రూ. 8000, శనగలు ప్రభుత్వం మద్దతు ధర రూ. 5850గా నిర్ణయించడం జరిగిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు.

February 28, 2026 / 04:57 PM IST

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర కలిసి ఆవిష్కరించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 28, 2026 / 04:55 PM IST

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 04:54 PM IST

సబ్ జైలును తనిఖీ చేసిన జడ్జి రాజ్యలక్ష్మి

W.G: నరసాపురం అదనపు సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి శనివారం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె జైలులోని రికార్డులను పరిశీలించి, ముద్దాయిలతో నేరుగా మాట్లాడారు. వారి కేసుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి, జైలులో అందిస్తున్న ఆహారం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జైలు ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.

February 28, 2026 / 04:54 PM IST

రాయచోటిలో మహిళా దినోత్సవ ర్యాలీ

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయచోటిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. SN కాలనీ నుంచి నేతాజీ సర్కిల్ వరకు విద్యార్థినులతో మానవహారం నిర్వహించారు. మహిళల పట్ల అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

February 28, 2026 / 04:54 PM IST