KMM: ఖమ్మం జిల్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించిన యూట్యూబ్ రిపోర్టర్ రఘుపై చర్యలు తీసుకోవాలని DCCB మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మధిర టౌన్ ఇన్స్‌పెక్టర్ రమేష్‌కు లిఖితపూర్వకంగా నాయకులు ఫిర్యాదు చేశారు. వర్గ విభేదాలు సృష్టించిన జర్నలిస్టుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.
VZM: అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానమే మూలం అని జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డా. ఎంవిఆర్ కృష్ణాజీ అన్నారు. చీపురుపల్లి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక సైన్స్ దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆవిష్కరణలు, శాస్త్ర విజ్ఞానం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, శివాజీ పాల్గొన్నారు.
PDPL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. వేద పండితులు రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో స్వామివార్లకు అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు స్వామివారికి తులాభారం నిర్వహించారు. గ్రామస్తుల సౌజన్యంతో విచ్చేసిన భక్తులందరికీ భారీగా అన్నదానం చేశారు.
టీ20 ప్రపంచకప్‌లో రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉండగా, గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. దీంతో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
SRPT: సూర్యాపేటలోని ఏప్రిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ సోమ కిరణ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ విచారణ జరిపారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు శనివారం సదరు సెంటర్‌ను సీజ్ చేశారు. అక్రమ స్కాన్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
NZB: బోధన్ పట్టణంలోని రాకాస్ పేట్లో, పాత బోధన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆధునిక హైమాస్ట్ లైట్లను మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రాంత ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించాలనే ఉద్దేశంతో ఈ లైట్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ ఎలక్ట్రిషన్, తదితరులు పాల్గొన్నారు.
WNP: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు చూరగొనాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నూతన మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. కొత్తకోట మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన ఛైర్‌పర్సన్ అరుణ, వైస్‌ఛైర్మన్ పల్లవి, కౌన్సిలర్లు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
అన్నమయ్య: రాయచోటిలోని డైయెట్‌లో బోధనా పరికరాల ఆధారిత తరగతి గది పరిశీలన అంశంపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ టీచ్ టూల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ ప్రతినిధులు పండవుల సాయిరామ్, నాగేంద్ర, కోర్స్ కోఆర్డినేటర్ మదితాటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
SRD: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఎహెచ్‌వోతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయాల్లో పోలీసులు వేగంగా స్పందించాలంటే వాహనాల నిర్వహణ బాధ్యతాయుతంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు. ప్రతి వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలని, మెకానికల్ కండిషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
PDPL: తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులేనని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన Slలు నక్క శామ్యూల్, నూనె శ్రీనివాస్, ASI వెంకటేష్ బాబు, హెడ్ కానిస్టేబుళ్లు అలీముద్దీన్, విజయేందర్ రెడ్డి కుటుంబాలను ఆత్మీయంగా సన్మానించారు.
NLR: కందుకూరు మున్సిపాలిటీ శివారు ప్రాంతాలలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసిందని MLA నాగేశ్వరరావు అన్నారు. శనివారం కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. త్వరలో శివారు ప్రాంత వాసుల మంచి నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
MNCL: కాసిపేట 1 ఇంక్లైన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు శనివారం పదోన్నతి పత్రాలు అందజేశారు. గని మేనేజర్ సతీష్, AITUC బెల్ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్‌లు ఏడుగురు ఓవర్ మన్ ఉద్యోగులకు హెడ్ ఓవర్ మన్‌గా పదోన్నతి పత్రాలు అందించారు. రక్షణ అధికారి రవీంద్ర నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సుమన్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, తదితరులు పాల్గొన్నారు.
ADB: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర కీలకమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. 42 సం.లు విధి నిర్వహణ చేసి పదవీ విరమణ పొందిన అధికారి స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్‌ను శనివారం SP అఖిల్ మహాజన్ ఘనంగా సత్కరించారు. ఆయురారోగ్యాలను కాపాడుకుంటూ వ్యాయామం చేస్తూ శేష జీవితాన్ని గడపాలని SP అఖిల్ మహాజన్ కోరారు.
VKB: కొండాపూర్ అంగన్వాడీ కేంద్రానికి టీచర్‌ను నియమించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత కొంతకాలం క్రితం విధులు నిర్వహించిన అనారోగ్య కారణాల వల్ల మృతి చెందింది. అంగన్వాడీ కేంద్రంలో సుమారు 20 మంది పిల్లలు వరకు ఉన్నారు. అయితే ఆయానే పిల్లలను చూసుకుంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ టీచర్లను నియమించాలని పలువురు కోరుతున్నారు.
NLR: వైసీపీ నాయకుల దగ్గర డబ్బులు లేక అడుక్కుని రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విమర్శించారు. కొడవలూరులో ఆమె మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజవర్గంలో అడుగుపెట్టని కాకాణి తాము డబ్బులు ఉన్న వాళ్ళమ్మని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ కుటుంబం నుంచి కూడా రాజకీయాల్లోకి మహిళా వస్తుందని గుర్తుపెట్టుకుని మాట్లాడాలన్నారు.