VKB: పరిగిలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న 39వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోనసీమ: రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో మార్చి 31 వరకు సెక్షన్-30 అమలులో ఉంటుందని ఇంఛార్జ్ డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రామచంద్రపురం, ద్రాక్షారామం, పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమృత బార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీ బీర్ ఘటన కలకలం రేపింది. ఆదివారం బీర్ సీసాలో చెత్త కనిపించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఒకే బాటిల్‌పై రెండు వేర్వేరు కంపెనీల పేర్లు ఉండటం అనుమానాలకు దారితీసింది. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, బార్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
KRNL: పెద్దకడుబూరులో రౌడీషీట్ కలిగిన వ్యక్తులకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ నిరంజన్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, గొడవలు చేయకుండా చట్టాలను గౌరవించాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని, ఏవైనా వివాదాలు ఉంటే చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని హెచ్చరించారు.
ATP: టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం అనంతపురంలో కిలో టమాటా రూ. 7 మాత్రమే పలుకుతోంది. కోత ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. దీంతో పండిన పంట పశువుల పాలవుతున్నాయి. ఆదాయం లేక సాగుపై మక్కువ తగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
JGL: జగిత్యాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్పీవీ టీకా ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నివారణ సాధ్యమని వైద్యులు వివరించారు.
TG: ఇరాన్‌లోని తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అందరినీ స్వదేశానికి సురక్షితంగా రప్పించాలన్నారు. గల్ఫ్ కార్మికుల కుటంబాలు ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పలు విమానసేవలు రద్దు అయిన సంగతి తెలిసిందే.
MHBD: బయ్యారం మండల కేంద్రంలో మెడ్ ప్లస్ మెడికల్ షాపును ఆదివారం బయ్యారం SI తిరుపతి, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి-కిషన్ నాయక్, జెగ్గు తండా సర్పంచ్ బొల్లి జయంతి-వెంకటకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి మాట్లాడుతూ.. మండలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
AKP: జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటన జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు తనిఖీలు చేపట్టిందన్నారు. నర్సీపట్నం, పరవాడ డీఎస్పీల ఆధ్వర్యంలో రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖలు సంయుక్తంగా అనధికారంగా నిర్వహిస్తున్న కేంద్రాలపై దాడులు చేస్తున్నామన్నారు.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. బెంగళూరులో దీని ట్రైలర్ మార్చి 8న విడుదల కానుంది. ఇక ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
MDK: నర్సాపూర్ BVRIT కళాశాలలో నిర్వహించిన భగ్గిలా పోటీలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని మహేందర్ సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 185 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌ను 3-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. స్నేహ్ రాణా 44, ప్రతీక 27, జెమీమా 42, హర్మన్‌ప్రీత్ 25 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అలనా కింగ్ 4 వికెట్లు, జార్జియా 2 వికెట్లు పడగొట్టారు.
CTR: కుప్పం పట్టణం కొత్తపేటలో శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారి షికారి ఉత్సవం ఆదివారం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో కోలాహలంగా ఊరేగించారు. ఉత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జాతరకు భారీగా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ధర్మకర్త శివకుమార్ తెలిపారు.
శంకర్‌పల్లి మున్సిపల్ నూతన చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ను ఆయన స్నేహితులు (1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ ) ఈరోజు ఘనంగా సన్మానించారు. తమ స్నేహితుడు మున్సిపల్ చైర్మన్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
NZB: కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్‌లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందజేశారు. మోతి బిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్‌కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లుక్క గంగాధర్ పాల్గొన్నారు.