MLG: మేడారం మహా జాతర విజయవంతానికి అందరూ పట్టుదలతో కృషి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ సాయంత్రం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో 251 కోట్లతో చేపట్టిన పనుల్లో 95% పూర్తయ్యాయని, మిగిలిన 5% పనులను త్వరలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
MHBD: జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో హ్యూమన్ రైట్స్ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న సంస్థ, టీం సభ్యులు, బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేస్తున్న వారి సేవలు మరవలేనివని అన్నారు.
E.G: నన్నయ యూనివర్సిటీలో శనివారం నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, ప్రిన్సిపల్ డా. పి.విజయనిర్మల, తదితరులు వేడుకలు ప్రారంభించారు. వికసిత భారత నిర్మాణంలో మహిళల పాత్రపై జరిగిన వర్క్‌షాప్‌లో వారు ప్రసంగించారు. సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు.
ఏలూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి మహిళ సాధికారత ఉపాధి కల్పన పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.
JN: సాగరం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గాద ఇన్నయ్య తండ్రి సాల్మన్ రెడ్డి మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్ రెడ్డి, రమేష్, తదితరులు ఉన్నారు.
GNTR: పెదకాకాని మండలం నంబూరులో శనివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ షాది ఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ వలివేటి మురళీకృష్ణ, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
HYD: ఆటోలో దాచిన బంగారం చోరీకి గురైన ఘటన హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. శనివారం మక్కా మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు. ఆటోలో బంగారం దాచి, పార్కింగ్ ఏరియాలో ఆటోను పార్కు చేశారు. అనంతరం వచ్చి చూడగా బంగారం మాయమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
E.G: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో శనివారం కమిషనర్ రాహుల్ మీనా కీలక ప్రకటన చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఆస్తి, ఖాళీ స్థలం పన్నులు, నీటి ఛార్జీల చెల్లింపునకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నగరపాలక సంస్థ ట్రెజరీలో పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్ లేదా సమీప సచివాలయాల్లో చెక్కుల ద్వారా కూడా పన్నులు కట్టే వెసులుబాటు కల్పించారు.
ASF: కుమ్మేర గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ వద్ద వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పసిపాప మృతి ఘటనకు కారణమైన అగ్రవర్ణ నాయకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
RR: కొత్తూరు పోలీస్ స్టేషన్‌ను ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ప్రాంగణం, రికార్డ్ రూమ్, స్టేషన్ రైటర్ రూమ్, రిసెప్షన్ సెంటర్ వంటి విభాగాలను పరిశీలించారు. వాటిని చక్కగా నిర్వహించుకోవాలన్నారు. నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీ కేసులు, నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు.
MBNR: మహబూబ్ నగర్ రీజియన్ పరిధిలో 10 RTC డిపోల గ్యారేజ్, వివిధ విభాగాల్లో అప్రెంటిషిప్ శిక్షణ ప్రతిపాదికన పనిచేయుటకు ఇంజనీరింగ్, డిప్లమా, పట్టభద్రులు, నాన్ ఇంజనీరింగ్ పట్టభద్రులు BA, BSC, BCOMలో 2021 తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు nttp:nats.education.gov.in వెబ్‌సైట్లో మార్చి 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు.
కృష్ణా: ఉంగుటూరు(M) ఆత్కూరులో నైపుణ్యాభివృద్ధి కోర్సులో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన యువ చైతన్య వేదిక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. యువత తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని కష్టపడి పని చేసి స్వయం ఆధారంగా నిలబడాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఇందులో విశ్రాంత IAS అధికారి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.
శ్రీలంకతో మ్యాచ్‌లో పాక్ ప్రస్తుతం 15 ఓవర్లలో 163/0 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తీరు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది. పాక్ సెమీస్ చేరాలంటే 65 పరుగుల తేడాతో లేదా 13 ఓవర్లలోపే గెలవాల్సి ఉండగా.. టాస్ గెలిచి లంక బౌలింగ్ ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. PAK క్వాలిఫై అయితేనే సెమీస్ లంకలో జరుగుతుంది. ఈ క్రమంలోనే లంక కావాలనే పాక్‌తో కుమ్మక్కైందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ADB: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, ఇందుకోసం 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
NLR: బుచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి సందర్శించారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఏకీకృత కుటుంబ సర్వే కు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటి పన్నులు త్వరగా చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.