డిస్టెన్స్, ఆన్‌లైన్‌లో హైయిర్ ఎడ్యుకేషన్‌లో కోర్సులను చదువుతున్న విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రమత్తం చేసింది. ఈ కోర్సులకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని తెలిపింది. కోర్సులకు సంబంధించిన అప్‌డేట్స్ కేవలం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఇస్తామని సూచించింది. UGC వెబ్‌సైట్ ugc.gov.inలో వచ్చే నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 దేశ సినిమా చరిత్రలో రికార్డులు నెలకొల్పుతోంది. ఐదు రోజుల్లోనే 922 కోట్లు వసూల్ చేసిన తొలి ఇండియా సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.
NLG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులను కల్పించడమే కాదు.. మహిళలకు, యువతులకు రక్షణ కల్పించాలని ఐద్వా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవహారాన్ని నిర్వహించి, హక్కుల పట్ల వారికి అవగాహన కల్పించారు.
చైనా వస్తువులపై సుంకాలు విధిస్తానంటూ అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక యుద్ధాల్లో విజేతలు ఉండరని వ్యాఖ్యానించారు. తమ ప్రయోజనాలను కాపాడుకుంటామని వెల్లడించారు. బహిరంగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో బెక్కం జనార్ధన్ రచించిన పండుగల సాయన్న పుస్తకం మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీయూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప, పీజీ కళాశాల ప్రిన్సిపల్ చంద్ర కిరణ్, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
BHPL: నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన ఉద్యోగులు అంకితభావంతో నిజాయతీగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. 9 శిక్షణను పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిన పోలీసు కానిస్టేబుళ్లతో ఎస్పీ సమావేశమయ్యారు. నిత్యం ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం అని, ప్రతికూల పరిస్థితులలో కూడా ఉద్యోగం చేయవలసి ఉంటుందన్నారు.
MDK: సీఎం సహా నిధి పేదలకు వరం అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలం కొడిప్యాక గ్రామానికి చెందిన మల్లారెడ్డికి రూ. 60వేల సీఎం సహాయ నిధి చెక్కును మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో హత్నూర మాజీ ఎంపీపీ వావిలాల నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు కొన్యాల నరసింహా రెడ్డి, ఆగమయ్య, బాబు యాదవ్, సురేష్ గౌడ్, పూల అర్జున్ పాల్గొన్నారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఎమ్మెల్యే సామేలు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పాఠశాల పరిసరాలను, రికార్డులను పరిశీలించారు.
ప్రకాశం: మద్దిపాడు మండలంలోని పెద్దకొత్తపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల దగ్గర నుంచి మండల రెవెన్యూ శాఖ అర్జీలను స్వీకరించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 50 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
WGL: కలర్ ఫోటో ఫేం హీరో సుహాస్, హీరోయిన్ మాళవిక ఖిలా వరంగల్లో ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా షూటింగ్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా మూవీ ప్రొడక్షన్ మేనేజర్ డాక్టర్ మేడారపు సుధాకర్ మాట్లాడారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు షూటింగ్ ఉంటుందని, ఈ సినిమాలో లోకల్ ఆర్టిస్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
WGL: ఈ నెల 14న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ప్రచార పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ ఆవిష్కరించారు. ఇరువర్గాల కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగపరుచుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సీపీ తెలిపారు.
కామారెడ్డి: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలు అమలు చేయాలని బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం సభ్యులు మంగళవారం డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు గంగాధర్, సాయిబాబా ఉన్నారు.
NRML: తండ్రిని చంపిన కొడుకును అరెస్టు చేసిన ఘటన మంగళవారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరాల మేరకు శనివారం నిర్మల్ మండలం మూటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మణిదీప్ తన తండ్రిని గొంతు నులిమి చంపివేయగా, మృతుడి సోదరుడు రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గ్రామీణ సీఐ రామకృష్ణ నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసినట్టు తెలిపారు.
ATP: నగరంలోని స్థానిక లోకదాలత్ హాల్ నందు మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ శివ ప్రసాద్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు అధికారులకు అనుసరించవలసిన న్యాయపరమైన విధానాల గురించి వివరించారు.
బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో స్టన్నింగ్ లుక్స్‌తో చేసిన ఫొటో షూట్‌ను షేర్ చేసింది. దీనికి పుష్ టు స్టార్ట్ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే జాన్వీ పోస్ట్‌కు సీతారామం ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ రిప్లే ఇస్తూ ఫైర్ ఎమోజీని పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటో షూట్ తెగ వైరల్ అవుతోంది.