NZB: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలని, ఆ దిశగా విద్యాభ్యాసం చేయాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నేడు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. మహిళలు ఉన్నతంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థి దశ నుంచే కృషి చేయాలి అన్నారు.
W.G: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమవరం మండలం జువ్వలపాలెం రోడ్డులోని ఓ పూల దుకాణం వద్దకు ఆయన వచ్చారు. పూలను ప్లాస్టిక్ కవర్స్‌లో ఇస్తుండటంతో దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉండగా ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడుతున్నారని అన్నారు.
W.G: విభిన్న ప్రతిభాశాలులు ఉన్నతంగా చదువుకుని జీవితంలో స్థిరపడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
KMM: పంజాబ్ రాష్ట్రంలో గిడ్డంగుల సంస్ధ బోర్డు సభ్యులతో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం సమావేశమయ్యారు. గోదాముల నిర్వహణతో పాటు పలు అంశాలపై అక్కడి గోదాముల అధికారులతో చర్చించినట్లు రాయల తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమంలో రాయల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యండి కోర్రా లక్ష్మి, జనరల్ మేనేజర్స్ పాల్గొన్నారు.
NRPT: ఇటీవల బెంగళూరులో జరిగిన లాన్ డబుల్స్ టెన్నిస్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నారాయణపేట అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ మంగళవారం ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ లెవల్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారన్నారు.
SKLM: శ్రీకాకుళం నియోజకవర్గాన్ని జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం గార మండలం అధికారులతో నియోజకవర్గ సమస్యలపై జెడ్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్ నుంచి మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు.
E.G: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనపర్తి నియోజకవర్గంలో ఆర్అండ్‌బీ రహదారుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎంతో ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి పనుల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ.. సీఎంకు వివరాలను తెలియజేసి వినతిపత్రం ఇచ్చారు.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో రేపు కిషోర్ బాలిక వికాసం పై మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సంతమాగులూరు ఐసీడీసీ సీడీపీవో సుధా తెలిపారు. రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కిషోర్ బాలిక వికాసం శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని అన్నారు.
CTR: వైసీపీ శ్రేణులంతా ప్రజలకు అండగా నిలవాలని మాజీ మంత్రి రోజా సూచించారు. నగరి పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమస్యలు వస్తే పరిష్కరించేలా పనిచేయాలని కోరారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ నీలమేఘం, ఇతర నాయకులు బాలకృష్ణన్, తిరుమల రెడ్డి, బాలకృష్ణన్, వేణుబాబు పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులై పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీవీ వరాలేలతో కూడిన ‘సుప్రీం’ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై స్పందించిన కేంద్రం.. కొవిడ్-19 మహమ్మారి అనేది గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తు అని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజల ప్రాణాలను కాపాడిందని ధర్మాసనం దృష్ట...
BHNG: యాదాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు శ్రీ రామచంద్ర మిషన్ ట్రైనర్ చేపూరి నరసింహ చారి ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న గ్రంథాలయ పాఠకులకు మెడిటేషన్ క్లాస్ నిర్వహించారు. ఉద్యోగ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాటూరి బాలేశ్వర్ చేపూరి రామకృష్ణ గ్రంథాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు.
GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మీతోనే నేను – మీ వెంటే నేను’ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, పనుల నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల నిర్వహణపై నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.
BDK: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22 అమలు చేసి, వేతనాలు పెంచాలని కోరుతూ.. సీఐటీయు ఆధ్వర్యంలో సింగరేణి జాయింట్ కమిషనర్ దేవరాజుకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ప్రతినెల 7వ తేదీలోపు వేతనాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి అన్నారు. అదేవిధంగా ప్రొఫెషనల్ టాక్స్ మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.
ప్రకాశం: ఈనెల 17న ఉదయం 11 గంటలకు కనిగిరి మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ కార్యాలయ పరిపాలన అధికారి జి ఫ్రాన్సిస్ బాబు మంగళవారం తెలిపారు. కనిగిరి మండలంలోని మండల స్థాయి అధికారులు అందరూ సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని పేర్కొన్నారు.
MDK: గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత స్థాయి వరకు క్రీడల్లో ఎదగాలని ఒక మంచి సంకల్పంతో సీఎం చీఫ్ మినిస్టర్ కప్ లాంటి పోటీలను పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.