కర్నూలు: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం క్యాంపెయిన్‌లో ఉత్తమ మరుగుదొడ్లు నిర్వహించిన వారికి కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పురస్కారాలు అందజేశారు. కర్నూలులో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి, హమారా శౌచాలయ్-హమారా సమ్మాన్‌లో భాగంగా వినియోగంలో లేని టాయిలెట్లను గుర్తించి వినియోగంలోకి తెచ్చేలా అవగాహన కలిగించడం, నిర్వహణపై చైతన్యం జరిగిందన్నారు.
ASR: ప్రభుత్వ పథకాలను గిరిజన పేదలకు అందించి ట్రైకార్‌కు పూర్వ వైభవం తెస్తామని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన పాడేరు ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజన యువతకు బొలేరో, ఇన్నోవా, స్విప్ట్ వాహనాలకు రుణాలు అందిస్తామని చెప్పారు.
HYD: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆధ్వర్యంలో మంగళవారం దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్‌లో ‘ప్రజల ఆకాంక్షలు ఏడాది ప్రభుత్వ పాలన’ అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. TUWJ రాష్ట్ర అధ్యక్షుడు కే.విరహత్ అలీ మోటివేటర్‌గా వ్యవహరించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో OU జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మ షాతో పాటు మేధావులు పాల్గొన్నారు.
PLD: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మంగళవారం వినుకొండలోని శివయ్య భవన్లో జరిగిన సమావేశంలో మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ.. డిశంబరు 26 సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని కోరారు.
E.G: టీడీపీలో బీసీలకు నిజంగా ఆన్యాయం జరుగుతుందని, బీసీ కులాల గొంతు నొక్కిన చంద్రబాబు చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సీట్లు కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమన్నారు.
కామారెడ్డి: మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని TPTF రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. నేడు జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో TPTF కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపుగా 9నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి అన్నారు.
NRPT: గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోస్గి మండలం గుండుమాలకు చెందిన ఫయాజ్ అలీ మేకల మందపై రోజు రాత్రి గుండుమాల్- పగిడిమాల్ ప్రాంతంలో చిరుత దాడి చేసి, ఓమేకను ఎత్తుకెళ్లి సమీపంలోనే చంపేసింది. గ్రామస్థులు FSO, FRO లక్ష్మణ్ నాయక్‌కు సమాచారం ఇవ్వంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మంగళవారం తహసీల్దార్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు అనుబంధంగా సమగ్ర శిక్ష అభియాన్‌లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ పే స్కేల్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఇవ్వాలని కోరారు.
HYD: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని ఆరోపించారు. BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నిరసనగా నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గం గోవింద్ హోటల్ చౌరస్తాలో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న విజయవాడకు రానున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహించనున్న మొదటి స్నాతకోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు. ఈ మేరకు 17న ఉదయం 11.20 గంటలకు విజయవాడకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
WNP: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు కొత్తకోట MRO కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యుగంధర్ యాదవ్ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ ప్రభుత్వ తరపున అందజేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి నేడు MRO వెంకటేశ్వర్ల కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు మహేష్,హరికృష్ణ అశోక్ వంశీ పాల్గొన్నారు.
SRPT: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని మండల ప్రత్యేక అధికారి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సీఎం కప్- 2024 మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సీఎం కప్ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
NLR: కొడవలూరు మండలంలోని కొత్త వంగల్లు, ఎల్లాయపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు వరిలో ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పిస్తూ భాస్వరం ఎరువులను కేవలం దుక్కిలో మాత్రమే ఉపయోగించుకోలన్నారు. పై పాటుగా ఎక్కువ మొత్తంలో వేయడం వలన సుష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
KNR: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మంగళవారం హైనా దాడిలో గైని చంద్రమౌళికి చెందిన దూడ మృతి చెందింది. రైతు చంద్రమౌళి ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపగా, బీట్ ఆఫీసర్ SK సమీనా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. హైనా దాడి కారణంగానే దూడ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ప్రకాశం: బల్లికురవ మండలంలోని అంబటి పూడి, ముక్తేశ్వరం వైదన గ్రామాలలో ఉన్నటువంటి ఉన్న స్మశాన వాటికలలో కంప చెట్ల తొలగింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలిపారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. స్మశాన వాటికలో కంప చెట్లను తొలగించే ప్రక్రియ జెసిబి సహాయంతో ప్రారంభించామని అన్నారు.