• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దారప్ప చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీలో వాడే దారప్పచెరువును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈరోజు స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఆ చెరువు మరమ్మతులు చేయాలని రైతులు కోరగా ఆ చెరువు నిండా గుర్రపు డెక్కఆకుతో నిండిపోయి ఉంది. దీంతో కింద ఉన్న వరి పొలాలకు రెండు పంటలకు నీరు అందే విధంగా సహకరించాలని స్థానిక రైతు కారం శ్రీరాములు ఎమ్మెల్యేకు వివరించారు.

March 1, 2026 / 12:00 PM IST

రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన

ప్రకాశం: కంభంలో SI శివకృష్ణారెడ్డి శనివారం రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 1, 2026 / 11:59 AM IST

జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక..!

KRNL: ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే వెబ్‌సైట్లను సృష్టించి, భారీ డిస్కౌంట్ల పేరుతో ముందస్తు చెల్లింపులు తీసుకుని వస్తువులు పంపకుండా కేటుగాళ్లు మోసం చేస్తున్నారన్నారు.

March 1, 2026 / 11:59 AM IST

వర్సిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తాం: పొన్నం

TG: విద్యాకమిషన్ నివేదికను రాజకీయం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్న నివేదికను స్వాగతిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించేలా అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

March 1, 2026 / 11:58 AM IST

మావోయిస్టులకు బిగ్ షాక్

TG: మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ మహాసముంద్ జిల్లాలో బలంగిరి – బర్‌గఢ్-మహాసముంద్ డివిజన్‌కు చెందిన కీలక మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్‍తో పాటు మరో 14 మంది సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో AK-47 రైఫిళ్లు, 2 SLRలు, మూడు 12-బోర్ గన్లు, 14 మస్కెట్లు పోలీసులకు అందజేశారు.

March 1, 2026 / 11:58 AM IST

అప్‌కమింగ్ ప్రాజెక్టులపై నిఖిల్ UPDATE

హీరో నిఖిల్ తన అప్‌కమింగ్ ప్రాజెక్టులపై క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘స్వయంభు’తో పాటు, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ఇండియా హౌస్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. వీటితో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కార్తికేయ-3’ కూడా లైన్‌లో ఉందని చెప్పి అభిమానుల్లో...

March 1, 2026 / 11:58 AM IST

యావపూర్‌లో స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం యావపూర్ సర్పంచ్ యంజాల స్వామి ఆధ్వర్యంలో యువకులు చీపుర్లు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని సర్పంచ్ స్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.

March 1, 2026 / 11:57 AM IST

నిరాటంకంగా ఇసుక అక్రమ రవాణా

JGL: జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గతంలో ట్రాక్టర్లకే పరిమితమైన ఈ దందా,ఇప్పుడు లారీలు, టిప్పర్లలో బహిరంగంగానే సాగుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రకృతి సంపదను తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.తనిఖీల్లో వాహనాలు పట్టుబడుతున్నా అక్రమార్కుల తీరు మారడం లేదని, అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నరు.

March 1, 2026 / 11:56 AM IST

జిమ్ లో లవ్.. పెళ్లికి నిరాకరణ!

SRD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్‌కు చెందిన యువతికి, మయూరినగర్ నివాసి అరవింద్‌కు జిమ్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించి దూరం పెడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

March 1, 2026 / 11:55 AM IST

‘అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి’

KMM: అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాము, వెంకట్రామయ్య అన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ వద్ద అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. మాదిగల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పేర్కొన్నారు.

March 1, 2026 / 11:54 AM IST

‘న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచే బాధ్యత తీసుకోవాలి’

AP: న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ‘అనారోగ్య సమస్య రాగానే నయమవుతుందన్న నమ్మకంతోనే ఆస్పత్రికి వెళ్తారు. వైద్యులు ఇచ్చిన భరోసాతో తమకు స్వస్థత చేకూరుతుందని నమ్ముతారు. అలాగే కోర్టుకు వచ్చామంటే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చేలా చేయాలి’ అని సూచించారు.  

March 1, 2026 / 11:51 AM IST

పెళ్లిపత్రికలో కొత్త వింత – జూట్ ట్రెండ్!

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పర్యావరణ స్పృహ పెరుగుతున్న వేళ, ఇప్పుడు జనపనారతో చేసిన పెళ్లిపత్రికలు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. కరీంనగర్‌లో నేషనల్ జూట్ బోర్డు ప్రదర్శించిన జూట్ పెళ్లిపత్రిక అందరినీ ఆకట్టుకుంది. చూడటానికి మహిళల హ్యాండ్‌బ్యాగ్‌లా ఉండి, తెరిస్తే పెళ్లిపత్రికగా కనిపించే ఈ వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

March 1, 2026 / 11:50 AM IST

నరసన్నపేటలో రేషన్ డిపో ప్రారంభం

శ్రీకాకుళం: నరసన్నపేటలోని కలివరపుపేటలో రేషన్ డిపోను రాష్ట్ర కూరాకుల, పొందర కార్పొరేషన్ అధ్యక్షులు దామోదర నరసింహులు ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రేషన్ డిపో డీలర్‌గా పనిచేసిన చక్రవర్తి రెండు నెలల క్రిందట మృతి చెందడంతో ఖాళీ ఏర్పడిందన్నారు. దీంతో లక్కోజు స్వప్నకు రేషన్ డిపో అప్పగించింది.

March 1, 2026 / 11:50 AM IST

మున్సిపాలిటీలో విస్తృత పర్యటన చేసిన జిల్లా కలెక్టర్

SKLM: శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పిలి వీధి, చిన్న బజార్, మేధర వీధి తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ విస్తృతంగా ఆదివారం పర్యటించారు. వార్డుల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోడ్ల శుభ్రత, చెత్త సేకరణ, కాలువల శుభ్రపరిచే పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

March 1, 2026 / 11:50 AM IST

జిల్లాలో 65 శాతం దాటిన ఫార్మర్ ఐడీ ప్రక్రియ

NRPT: జిల్లాలో రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 65.03 శాతం పూర్తయ్యింది. మొత్తం 1,84,713 మంది పట్టాదారుల్లో 1,20,120 మంది ఇప్పటికే నమోదు చేసుకోగా, ఇంకా 64,593 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 4,59,000 ఎకరాల భూమి ఉండగా, అందులో 4,25,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

March 1, 2026 / 11:47 AM IST