KMM: ప్రభుత్వాలు మారిన ప్రజల బ్రతుకులు బాగుపడలేదని ప్రజా సమస్యల పరిష్కారంలో మార్పు రాలేదని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య అన్నారు. మంగళవారం రామాపురంలో జిల్లా కమిటీ సభ్యుడు సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన 20 కుటుంబాలు సీపీఎం పార్టీలో చేరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
AP: హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ కోర్టులోని చెక్ బౌన్స్ కేసును ధర్మాసనం కొట్టివేసింది. ఈ విచారణకు మంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
కృష్ణా: వీరులపాడు మండల పరిధిలోని జయంతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తాహశీల్దార్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని భూములకు సంబంధించిన వివాదాలు త్వరితగతిన పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. భూ సమస్యలను రైతులు అర్జీ రూపంలో ఇచ్చారన్నారు.
కృష్ణా: ప్రతి ఒక్కరూ మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ముఖ్య వక్తగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులను ఉద్దేశించి హ్యూమన్ రైట్స్ అంశంపై అవగాహన కల్పించారు.
ASR: APSSDC, ఉపాధి, సీడాప్‌ల ఆధ్వర్యంలో అరకులోయ RITI నందు డిసెంబర్ 12న జాబ్ మేళా ఉందని జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డా.రోహిణీ తెలిపారు. జాబ్ మేళాలో రుద్ర కోపరేటివ్ సర్వీసెస్, మోహన్ స్పీఇంటెక్, పేటీయం, నవత ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఆపై చదివిన 18 – 30 వయసు వారు అర్హులన్నారు. 9491057527, 9398338105 సంప్రదించాలన్నారు
VZM: నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు కోరారు. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని బంగార్రాజు కలిసి నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. మత్స్యకారులు, రైతులు సమస్యలను బంగార్రాజు విన్నవించారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
NRML: LRS కింద వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో LRS దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.
GNTR: పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు. పంట పండించిన రైతు దగ్గర గిట్టుబాటు ధర వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆరుదల లక్ష్మయ్య అనే రైతుకు ధాన్యం కొనుగోలు కూపన్‌ను అందజేశారు.
MDK: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం మెదక్ జిల్లా కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఏ విటల్, సెక్రెటరీ నాగభూషణం, ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును, అదనపు కలెక్టర్ నగేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
TG: తాను ఎప్పుడూ ఫైర్ బ్రాండేనని ఎంపీ అర్వింద్ అన్నారు. తన బండి గేర్ తన చేతిలోనే ఉందని సమయాన్ని బట్టి గేర్, స్పీడ్ మారుతుందని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో పిచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్, కవితలకు కుక్క కూడా ఓటు వేయదన్నారు. కేటీఆర్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని స్పష్టం చేశారు.
KNL: రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరేట్లోని సెంచునరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వల్లే డామేజ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో ఏపీని గాడిన పెట్టామన్నారు.
CTR: ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుడా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ.. హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐ మధుసూదన్ హక్కుల పరిరక్షణపై వివరించారు. విద్యార్థులు చైతన్యవంతం కావాలని సూచించారు. ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, హెచ్‌వోడీ నీరజా పాల్గొన్నారు.
MDK: మెదక్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమని లేదన్నారు. కనీసం మహిళా ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు.
NLR: జిల్లాలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఎంపీ వేమిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. టెండరింగ్ మొదలైన వాటికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
SKLM: వసతి గృహాలు పరిశుభ్రత, పౌష్టిక ఆహారం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయశాఖ సంస్థ, కార్యదర్శి, ఆర్.సన్యాసి నాయుడు అన్నారు. మంగళవారం రణస్థలంలో గల గవర్నమెంట్ కళాశాల నందు బిసి హాస్టల్‌ను సందర్శించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు ఆహార సదుపాయాలు గురించి ఆరా తీస్తూ తగు సూచనలు ఇస్తూ పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు.