E.G: రాజమండ్రిలో భవనాలు అనుమతి పొందిన ప్లాన్ల ప్రకారమే కడితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. శనివారం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సోమాలమ్మ టెంపుల్ రోడ్డు, గాదాలమ్మ నగర్ ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. పలు భవనాల ప్లాన్లు, లేఅవుట్లను పరిశీలించారు. భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి అని సూచించారు.
ATP: ఉరవకొండలో ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా పెన్నహోబిలంలోని లక్ష్మీ నరిసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో తిరుమలరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు ద్వారాలు మూసి వేయనున్నారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
NLR: ముత్తుకూరులోని కృష్ణపట్నం సర్కిల్ కార్యాలయం ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం సందర్శించారు. తనిఖీలో భాగంగా స్టేషన్లోని పెండింగ్ కేసులు, రికార్డులు, మ్యాపులను నిశితంగా పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
AP: అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పరిధిలోని అడవుల్లో మంటలు వ్యాపించాయి. సెరికల్చర్ ఫాం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నిన్న నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రాత్రి వరకు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఈ మంటల్లో కొన్ని జంతువులు కాలిపోతున్నాయని వెల్లడించారు. ఫాం వద్ద మంటలు ఆర్పివేశామని అటవిశాఖ అధికారి చెప్పారు.
BPT: అద్దంకి మండలంలోని మధుర నగర్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కొంగపాడు గ్రామానికి చెందిన వినోద్, చిన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరించకపోవడంతోనే ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు పేర్కొన్నారు.
BHPL: కాలేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేయనున్నట్లు ఆలయ EO మహేష్ తెలిపారు. ఉదయం 6:30 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు ఉండవని, భక్తులు గమనించాలని EO కోరారు.
ప్రకాశం: ఒంగోలు DSP శ్రీనివాసరావు తన పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలీస్ స్టేషన్ వారీగా నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించారు. దొంగతనాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతంచేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు.
ప్రకాశం: వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 24 మంది మృత్యువాత పడటం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్‌తో శనివారం సాయంత్రం MGNREGS పనులపై కలెక్టర్ డా, సత్య శారద సమీక్ష నిర్వహించారు. పనుల విధానం, కార్మికుల చెల్లింపులు మాస్టర్ రోల్స్ నిర్వహణ నాణ్యత పనులపై అధికారులతో చర్చించి పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఆడిట్ నివేదిక త్వరగా దించాలని అధికారులను కోరారు.
SDPT: బెజ్జంకిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం పరిసరాలు, కాలేజీ ప్రాంతం, పెట్రోల్ బంక్ మార్గం అలాగే ఎల్లంపల్లి వరకు ఈ పవర్ కట్ అమల్లో ఉంటుంది. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని శాఖకు సహకరించాలని కోరారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ మీద యుద్ధం.. ప్రధాని మోదీకి తెలుసా? తెలియదా? అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు. ఇజ్రాయెల్ మోదీకి ఈ యుద్ధం గురించి చెప్పిందా?.. లేదా? అని ప్రశ్నించారు. 10 కోట్ల మంది భారతీయులు దుబాయ్, మిడిల్ ఈస్ట్‌లో ఉన్నారని.. వారందరినీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందన్నారు.
CTR: వైసీపీ నేత ఆర్కే రోజా కుమార్తె అన్హు మాలికకు అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డును శనివారం ప్రదానం చేసింది. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ కోర్సు చదువుతున్న అనుమాలిక రచయిత్రి కూడా. ఆమె రచించిన ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ అనే నవల ప్రశంసలందుకుంది. కుమార్తె అవార్డు అందుకోవడంపై రోజా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
NZB: మార్చి 15 లోపు IKP ద్వారా అందించిన రుణాలను 98% రికవరీ చేయాలని వివోఏలను, సీసీలకు ఏపీడి మధుసూదన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం రెంజల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సీసీలకు, వివోఏలకు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార మిషనరీలకు సంబంధించిన 20 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి 35% సబ్సిడీ కింద రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు.
కర్నూలు: జిల్లా కలెక్టర్ సిరి మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని అధికారులను శనివారం ఆదేశించారు. కలెక్టరేట్ NCORD సమావేశంలో విద్యాసంస్థల వద్ద కఠిన నిఘా, RTC బస్సుల్లో అక్రమ రవాణా నిరోధం జారీ చేయాలన్నారు. జనవరి నుంచి 2 కేసులు నమోదు, 1.350 కిలోల గంజాయి స్వాధీనం. రెవెన్యూ, పోలీస్ శాఖలను గంజాయి సాగుపై నిఘా ఉంచమని కలెక్టర్ సూచించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు చెల్లించని మొండి బకాయి దారులకు నోటీసులు జారీ చేసి, మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూళ్లలో భాగంగా పలు డివిజన్లలో పర్యటించారు. రేకుర్తి, కాపువాడ, రాంనగర్, కోతి రాంపూర్, అల్గునూర్‌లలో ఆస్తి పన్నుల వసూళ్లను పరిశీలించారు.