• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జవాబుదారీగా ఉండాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం: భట్టి

AP: ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 10, 2024 / 07:10 PM IST

‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్‌.. రూ.10 కోట్ల బడ్జెట్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్‌కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ. ఈ నేపథ్యంలోనే ‘నానా హైరానా’ సాంగ్‌ను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ సాంగ్ క...

December 10, 2024 / 07:09 PM IST

104 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని వినతి

SKLM: ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ -2 సర్పంచ్ కృష్ణారావుకు 104 సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. తమకి నెల నెల జీతాలు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. దీనితో కుటుంబ పోషణ కష్టమవుతుందని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

December 10, 2024 / 07:07 PM IST

రేపు పుంగనూరులో జాబ్ మేళా

CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి సమీపన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు (బుధవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి మంగళవారం తెలిపారు. జాబ్ మేళకు 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతీ యువకులు తమ సర్టిఫికెట్స్‌తో ఇంటర్వ్యూకు హాజరుకావాలని అన్నారు.

December 10, 2024 / 07:06 PM IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన కలిశెట్టి

SKLM: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కుటుంబ సమేతంగా మంగళవారం ఎచ్చెర్ల టీడీపీ నాయకులు విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగంలో ఏర్పాటు చేయబోతున్న మహిళల సమావేశానికి రాష్ట్రపతి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు AP రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

December 10, 2024 / 07:06 PM IST

స్కూళ్లలో సదుపాయాలపై పిల్‌ దాఖలు.. విచారణ వాయిదా

TG: ఆశ్రమ, గురుకుల స్కూళ్లలో సదుపాయాలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆశ్రమ, గురుకుల స్కూళ్లలో ఆహార నాణ్యత లోపించిందని శ్రీగురు తేజ పిల్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

December 10, 2024 / 07:04 PM IST

మానకొండూరులో రూ.100 కోట్లతో కొత్త పనులు

KNR: రోడ్లు, భవనాలశాఖ ద్వారా మానకొండూర్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో కొత్త పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులే కాకుండా కొత్త పనులకు నిధుల మంజూరు, పెండింగ్ పనుల పూర్తి చేయించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఛాంబర్లో కలిశారు.

December 10, 2024 / 07:04 PM IST

హెల్మెట్ ధరించి ప్రయాణించడం సురక్షితం

ప్రకాశం: సైబర్ నేరాలపై మరియు హెల్మెట్ల వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు కంభం సీఐ కే.మల్లికార్జునరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. హెల్మెట్లు ధరించి ప్రయాణించడం సురక్షితమన్నారు.

December 10, 2024 / 07:03 PM IST

‘అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు’

MBNR: అమ్మాయిలను వేధించే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షి టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. మంగళవారం మక్తల్ గురుకుల పాఠశాల, కలశాలలో విద్యార్థులకు షి టీమ్ పై అవగాహన కల్పించారు. ఆకతాయిలు వేధిస్తే షీ టీం పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.

December 10, 2024 / 07:02 PM IST

‘తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

KDP: వర్షాలతో దెబ్బతిన్న రైతుల వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని BJP రాష్ట్ర నాయకుడు మాదినేని రామసుబ్బయ్య, మండల అధ్యక్షులు గాడి భాస్కర్, సీనియర్ నాయకులు లేవాకు రామ్ మోహన్ రెడ్డిలు కోరారు. వర్షాలతో నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలని మంగళవారం జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్‌కు BJP నాయకులు వినతి పత్రం అందజేశారు.

December 10, 2024 / 07:00 PM IST

మత్తుకు యువత దూరంగా ఉండాలి

VZM: మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని 1వ పట్టణ ఎస్సై నరేష్ సూచించారు. పట్టణంలోని ఓ స్టడీ సర్కిల్‌లో యువతకు మంగళవారం అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేశామని వాటి ద్వారా తమకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

December 10, 2024 / 06:59 PM IST

ఆశాల ధర్నాపై మంత్రి దామోదర రియాక్షన్

TG: ఆశా వర్కర్ల ద్వారా ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహా ఆరోపించారు. ఆశా వర్కర్ల ధర్నాపై ఆయన స్పందించారు. ప్రభుత్వం నిర్వహించే విజయోత్సవాలను ప్రతిపక్షం తట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆశావర్కర్లకు జీతాలు పెంచలేదని తెలిపారు. బీఆర్ఎస్ మాయలో పడి రోడ్లపైకి రావద్దని ఆశా వర్కర్లకు సూచించారు.

December 10, 2024 / 06:58 PM IST

గెలుపును నిలుపుకోవాలి: మంత్రి పొన్నం

SDTP: గెలిచిన క్రీడాకారులు ఆ గెలుపును నిలుపుకోవాలని, ఓడినా వారు గెలవడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులకు మంత్రి పొన్నం సూచించారు. మంగళవారం హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ -2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:57 PM IST

తెలంగాణ తల్లిపై పాట రాస్తా: సుద్దాల అశోక్

TG: తెలంగాణ తల్లిపై త్వరలో పాట రాస్తానని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. జాతీయ అవార్డు కంటే రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ తల్లిని చూస్తే వాళ్ల అమ్మని చూసినట్లు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ కూడా అడిగితేనే పెడుతుందని.. అడగకుండానే గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.

December 10, 2024 / 06:56 PM IST

యాడికిలో పర్యటించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

ATP: యాడికి మండల కేంద్రంలో జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. అరటి రైతుల సమస్యలు, ఇసుక సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యాడికి కాలువకు త్వరలోనే నీటిని విడుదల చేస్తానన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ రుద్రమ నాయుడు, రంగయ్య, చరణ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 06:54 PM IST