• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా వ్యాప్తంగా ‘విజిబుల్ పోలీసింగ్’

ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’ చేపట్టారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ​ఈ సందర్భంగా డ్రంకన్‌ అండ్ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వంటి రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు.

November 21, 2025 / 05:06 AM IST

హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

E.G: ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రి డిపో నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏసీ బస్సు సర్వీసు నెం 2777పై 15% రాయితీ కల్పించినట్లు తూ. గో జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు. సూపర్ లగ్జరీ నాన్ ఏసీ బస్సు టికెట్ ధరతో ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఈ రాయితీ DEC 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

November 21, 2025 / 05:05 AM IST

కేజీబీవీలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహణ

Srcl: రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థులకు మండల వైద్యాధికారులు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్త పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అభినయ, ప్రభాకర్, కేజీబీవి ఎస్‌వో వనిత, ఏఎన్ఎం విజయ పాల్గొన్నారు.

November 21, 2025 / 04:59 AM IST

CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 రైల్వే కోడూరు మండలం విపిఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన కొండూరు తులసమ్మకు రూ.10 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురువారం అందజేశారు. ప్రజలకు అత్యవసర సమయంలో తోడుగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైద్య అవసరాల కోసం CMRF ఎంతో సహాయం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

November 21, 2025 / 04:52 AM IST

భాషా వివాదం.. విద్యార్థి ఆత్మహత్య

మహారాష్ట్రలో హిందీ-మరాఠీ భాషా వివాదం కారణంగా 19 ఏళ్ల విద్యార్థి అర్ణవ్ జితేంద్ర ఖైరే ఆత్మహత్య చేసుకున్నాడు. లోకల్ ట్రైన్‌లో హిందీలో మాట్లాడినందుకు 4-5 మంది యువకులు అర్ణవ్‌పై దాడి చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య  చేసుకున్నాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

November 21, 2025 / 04:50 AM IST

‘క్రీడారంగంలో జిల్లాకు మంచి పేరు తీవాలి’

ASF: క్రీడారంగంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ASF గిరిజన ఆదర్శ పాఠశాల మైదానంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ పోటీలలో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.

November 21, 2025 / 04:49 AM IST

పలాస ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: పలాస ఎమ్మెల్యే శుక్రవారం ఉ. 10.30 గంటలకు మందస మండలం సొండి పూడి గ్రామంలో జరిగే 37వ రాష్ట్రస్థాయి బాల బాలికల అండర్ 14 టెన్నికాయిట్ టోర్నమెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మ. 1 గంటకు గోపి నాధపురంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

November 21, 2025 / 04:24 AM IST

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: MLA

HYD: విద్యార్థులు చదువుతోపాటు ప్రతిభ కలిగిన ప్రతి రంగంలో రాణించాలని ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి సూచించారు. రామంతాపూర్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌ను ఆయన ప్రారంభించి, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. సైన్స్ ఫెయిర్ విద్యార్థులు రూపొందించిన మోడళ్లను పరిశీలించి, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధికి విద్యార్థుల్లో ఆసక్తి పెరగాలన్నారు.

November 21, 2025 / 04:23 AM IST

ఇన్నోవేషన్ మేళాలో విద్యార్థి ప్రతిభ

Srcl: జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ఇన్నోవేషన్ మేళాలో చందుర్తి మండలం జోగాపూర్ హైస్కూల్‌లో 10 తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీవిన్ గురువారం ప్రథమ స్థానంలో నిలిచి జ్ఞాపిక, ప్రశంస పత్రం అందుకున్నాడు. గైడ్ టీచర్ అంజయ్య నేతృత్వంలో స్థిరమైన వ్యవసాయంలో యంత్రాన్ని తయారుచేసి ప్రదర్శించినందుకు (సుస్థిర వ్యవసాయం)‌ అనే ఉప అంశంలో బహుమతి లభించిందని శ్రీవిన్ పేర్కొన్నాడు.

November 21, 2025 / 04:19 AM IST

“ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి”

MLG: ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు రెసిడెన్షియల్ పద్ధతిలో స్క్రీనింగ్ నిర్వహించి, ఎంపికైన వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 25లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

November 21, 2025 / 04:01 AM IST

నిఖత్ జరీన్‌కు సీఎం రేవంత్ అభినందనలు

ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణ పతకం గెలిచిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రపంచ వేదికపై ఆమె అద్భుతమైన ప్రతిభతో దేశ కీర్తిని చాటారని ప్రశంసించారు. నిఖత్ మరిన్ని విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిఖత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

November 21, 2025 / 03:05 AM IST

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు ప్రధాని లేఖ

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈనెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో ఏడడుగులు నడవనుంది. ఈ శుభ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

November 20, 2025 / 11:45 PM IST

సిట్ విచారణకు సహకరిస్తా: సుబ్బారెడ్డి

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ తాను సమాధానాలు ఇచ్చానట్లు ఆయన తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరవుతానని, దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ కేసులో నిజా నిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని ఆయన వెల్లడించారు.

November 20, 2025 / 11:25 PM IST

శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే

పాకిస్తాన్‌లో జరుగుతున్న T20 ట్రై సిరీస్‌లో శ్రీలంకకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 162/8 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 95 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో 47 పరుగులు, బౌలింగ్‌లో 1 వికెట్ తీసిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ‘MOM’గా నిలిచాడు.

November 20, 2025 / 10:59 PM IST

రూ.285 కోట్లకు పైగా స్కామ్‌పై ED దర్యాప్తు

దేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ED అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ FIRలపై దర్యాప్తు ప్రారంభించి.. నకిలీ ఈ-కామర్స్‌కు చెందిన 92 బ్యాంకు అకౌంట్లలోని రూ.8.46 కోట్లు ఫ్రీజ్ చేశారు. అలాగే, వాట్సాప్, టెలిగ్రామ్ టిప్స్ ఫాలో అయితే కమీషన్ వస్తుందంటూ జరిగిన రూ.285cr భారీ స్కామ్‌ను కూడా గుర్తించారు.

November 20, 2025 / 10:24 PM IST