• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 8 సైబర్ మోసాల కేసుల్లో 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 117 కేసుల్లో బాధితులకు 564 రిఫండ్ ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రూ.1.62 కోట్లకు పైగా రిఫండ్ ప్రక్రియ కొనసాగింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుణెలో కీలక నిందితుడు అర్జున్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 09:32 PM IST

మార్చి 3న సింహాచలంలో డోలోత్సవం

VSP: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మార్చి 3న శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో డోలోత్సవం, వసంతోత్సవం, గ్రామ తిరువీధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం స్వామివారు కొండదిగువ పుష్కరిణి ఉద్యానవన మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.

February 28, 2026 / 09:31 PM IST

ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి: CM

AP: ఉపాధి కోసమే చాలామంది క్రాకర్స్ ఫ్యాక్టరీలకు వెళ్తున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు ఎక్కడున్నా పట్టుకొస్తామని, ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 28, 2026 / 09:30 PM IST

గ్రామ కమిటీలతో పార్టీ బలోపేతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన కార్యాలయంలో క్యాంప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ కమిటీలు చురుకుగా పనిచేస్తూ గ్రామస్థాయిలో వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తూ ప్రజలకు నిజ పరిస్థితులను తెలియజేయాలన్నారు.

February 28, 2026 / 09:30 PM IST

గొంగివారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. దివ్యాంగుల లబ్ధిదారుడు రమేష్‌కు ఇంటి వద్దే పింఛన్ అందజేశారు. బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సరఫరాపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు.

February 28, 2026 / 09:25 PM IST

జమ్మూకశ్మీర్‌ జట్టుకు భారీ న‌జ‌రానా

67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేస్తూ.. జట్టు ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించారు. జట్టు మొత్తానికి రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 09:16 PM IST

‘దివ్యాంగ ఉద్యోగులకు సెర్ప్ కల్పించాలి’

ELR: గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లో దివ్యాంగ ఉద్యోగులకు కల్పించే సదుపాయాలన్నీ సెర్ప్ కల్పించాలని రాష్ట్ర సర్ప్ డీఏపీ యూనియన్ నాయకుడు రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం వారు విజయవాడలో సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణకు వినతిపత్రం అందజేశారు. సీసీ క్యాడర్లలో పనిచేసే వారికి సొంత మండలాలలో అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నిడమర్రు ఏపీఎం, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 09:15 PM IST

BREAKING: మృతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా.. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాల పిల్లలను చదివిస్తామని, ఇళ్లు లేనివారికి ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు.

February 28, 2026 / 09:12 PM IST

పలు హోటళ్లలో ఫుడ్‌సెఫ్టీ అధికారులు సోదాలు

TG: సికింద్రాబాద్‌లోని పలు హోటళ్లలో ఫుడ్‌సెఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రెండు హోటళ్లకు నోటీసులు జారీ చేసింది. ముడి సరుకుల కొనుగోలు, నిల్వ, నాణ్యతకు సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు. వంట గదులలో కనీస పరిశుభ్రత పాటించకపోవడం, గడువు ముగిసిన పదార్థాలను వాడటం వంటి అంశాలను పరిశీలించారు.

February 28, 2026 / 09:11 PM IST

‘మీకు విద్య గురించి మాట్లాడే హక్కు లేదు’

TG: విద్యాకమిషన్‌పై మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించిన మీకు విద్య గురించి మాట్లాడే హక్కు లేదు. కమిషన్ రిపోర్ట్ మీద కాకుండా మా టీం విద్యార్హతల మీద ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మా అర్హతలేంటో మమ్మల్ని అడిగితే ఇచ్చేవాళ్లం. మీ కంటే ఈ సర్కార్ 1000 రెట్లు నయం’ అని అన్నారు.

February 28, 2026 / 09:08 PM IST

ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యం: SP

ADB: అరైవ్ అలైవ్‌లో భాగంగా జిల్లాలో జరుగు రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు SP అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని అన్నారు. ఆ సమయంలో సరైన ప్రథమ చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.

February 28, 2026 / 09:06 PM IST

మానసిక ఆరోగ్య సేవలకు టోల్ ఫ్రీ 14416

WNP: మానసికపరమైన ఆరోగ్య సమస్యలపై కౌన్సిలింగ్, చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 14416 ప్రారంభించినట్లు వనపర్తి జిల్లా ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. అనుమానాలు, సూచనలు, చికిత్స కోసం ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించుకోవాలన్నారు. ఈ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.

February 28, 2026 / 09:05 PM IST

బాధ్యుల ఆస్తులు.. బాధితులకు పంచుతాం: చంద్రబాబు

AP: వేట్లపాలెం ఘటన చాలా దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఘటన జరిగిన ప్రాంతం హృదయ విదారకంగా ఉంది.  ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణ కమిటీ నియమిస్తాం. నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నాం. బాధ్యులను అరెస్ట్ చేసి.. జీవిత ఖైదు పడేలా చూస్తాం. బాధ్యుల ఆస్తులు జప్తు చేసి.. బాధితుల కుటుంబాలకు పంచుతాం’ అని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 09:04 PM IST

‘గోడౌన్లు సిద్ధం చేయాలి’

NZB: ప్రస్తుత సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు పీ. సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు, అని ఆరా తీశారు.

February 28, 2026 / 09:03 PM IST

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

ASR: అనంతగిరి(M) గరుగుపల్లి పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ ఇఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ మాజీ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు ఆశయాలు, అభివృద్ధి దృష్టి నచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు.

February 28, 2026 / 09:00 PM IST