NZB: ప్రస్తుత సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు పీ. సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు, అని ఆరా తీశారు.