PPM: ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని, తిరిగి వారు సంతృప్తి వ్యక్తం చేసే దిశగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. జగన్నాధపురం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. తొలుత హెచ్.పి.వి వ్యాక్సిన్ లాంచింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి వీక్షించారు.
VSP: జనసేన పార్టీ నగర కార్యాలయంలో క్రియాశీల (ఉద్యమి) సభ్యత్వ నమోదుపై శనివారం ముఖ్య సమావేశం జరిగింది. నగర (పార్లమెంట్) అధ్యక్షుడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు, ఉత్తర నియోజకవర్గాల నాయకులతో చర్చించారు. సభ్యత్వంపై కార్యకర్తల సందేహాలు తెలుసుకుని నివృత్తి చేశారు. ప్రతి కార్యకర్త ఉద్యమి సభ్యత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలన్నారు.
ASR: ఉర్లకులపాడులో కిడ్నీ బాధితులను ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. ఇక్కడ ఆరుగురు మరణించినా, నీటి నమూనాలు సురక్షితమేనని, అపోహలు వద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం, గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
AKP: గొలుగొండ మండలం జోగంపేటలో ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసి లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది అన్నారు.
SKLM: జిల్లాలో పట్టుబడిన మాదక ద్రవ్యాలను అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం వంశధార పాత క్వార్టర్స్‌లోని భవనాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావు కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్, అధికారులు ఉన్నారు.
ప్రకాశం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ను పరిశీలించిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రతపై యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
JGL: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసారి 4 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రూ.940 కోట్లతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, నిరంతర విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
కడప నగరంలోని 50వ డివిజన్ ఆలం ఖాన్ పల్లిలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి భూమిపూజ నిర్వహించారు. చిరకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
NGKL: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి అడ్మిషన్లకు సంబంధించి గోడపత్రికను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడ పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
TG: 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణా రెడ్డితో పాటు సీఎం సలహాదారు, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, ప్రజల సమస్యల తక్షణ పరిష్కారంపై ఈ ప్లాన్ దృష్టి సారించనుంది.
మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ శనివారం క్రైంమీటింగ్ నిర్వహించారు. నేరసమీక్ష అనంతరం ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ సూచించారు.
కర్నూలు జిల్లా ఎదురూరు గ్రామం వద్ద ఇవాళ ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన కురువ పరుశరాముడు(24) నడుచుకుంటూ వెళ్తుండగా కర్నూలు రెండో డిపోకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేలు జరిమానా తప్పదని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు హెచ్చరించారు. శనివారం వేములపాడు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఎస్సై నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
కృష్ణా: గుడివాడలో విద్యార్థులకు టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ ఓపెన్ హౌస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫిర్యాదు (Complaint) అంటే ఏమిటి, ఎఫ్‌ఐఆర్ (FIR) అంటే ఏమిటి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసే విధానం, తదనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేసే ప్రక్రియ వంటి అంశాల గురించి వివరించారు.
TG: ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు సహాకారం అందించాలని పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనలో 23 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత కుటంబాలకు కేంద్రం రూ. 2 లక్షలు ప్రకటించింది.