KDP: గాలివీడు మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో సౌరశక్తితో పనిచేసే డ్యూయల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరవీడు గ్రామంలో దాత మందపాటి రవీంద్ర బాబు, గరుగుపల్లి సచివాలయం వద్ద మోపురి వెంకటరమణ సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ భద్రత కోసం సహకరించిన దాతలు, ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో అమృత్ 2.0 పథకంలో భాగంగా, చేపట్టిన పైపులైన్ పనులను కౌన్సిలర్ గాజుల రాజమల్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పైపులైన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, ఆశ్రమ స్థలదాత పోనక కనకమ్మ విగ్రహానికి పట్టు వస్త్రం, నూలు మాల సమర్పించారు. అనంతరం ఆశ్రమ కమిటీ సభ్యులు దయాకర్ రెడ్డి విద్యార్థులకు ఆశ్రమ స్థల దాత, స్వాతంత్య్ర సమరయోధురాలు పోనక కనకమ్మ జీవిత విశేషాల గురించి వివరించారు.
అన్నమయ్య: మట్లి పెద్దూరులో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరకు రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. పీఏసీ ఛైర్మన్ రాజా నాయుడు ఆహ్వానం మేరకు జాతర కార్యక్రమంలో పాల్గొని భక్తుల ఆదరణను స్వీకరించారు. గంగమ్మ చల్లని చూపులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
MBNR: జిల్లా కేంద్రంలో NTR మహిళ డిగ్రీ కళాశాలలో జరిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ (5) నెలల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు 617 మంది హాజరయ్యారు. వీరిలో మెరిట్ 100 మందికి 5 నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో (GROUP1,2,3,&4, SI & PC, RRB, BANKING) DD (SCDD) డి.సునీత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు.
GDWL: అలంపూర్ మున్సిపల్‌లోని పది వార్డులలో స్తంభాలకు విద్యుత్ దీపాలు నిరంతరాయంగా 24 గంటలు వెలుగుతూనే ఉన్నాయి. కాగా ఈ భారం తమ పైన పడుతుందని స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా అదే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు ఆదివారం మధ్యాహ్నం మరణించడంతో ఈ సంఖ్య పెరిగింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.
WGL: జిల్లాలో 108 అంబులెన్స్ సర్వీసుల్లో ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) & డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఇవాళ తెలిపారు. MLT, GNM, ANM, BSC నర్సింగ్ పూర్తి చేసి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత పత్రాలతో జిల్లాలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NLG: మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కాటంరాజు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి బాధతో గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి ఇవాళ ఆయన కుటుంబాన్ని పరామర్శించి, రూ. ఒక లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
NLR: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులుకు కలిగిరి మండల లెవెల్ ప్రతిభా పాఠవ పరీక్ష -2026ను స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగిరి నందు ఆదివారం నిర్వహించారు. కలిగిరి మండల అపస్ అధ్యక్షులు అంకినపల్లి మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
MNCL: బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి నాయకులు అన్నారు. ఆదివారం జన్నారంలో వారు మాట్లాడుతూ.. దేశంలో 55 శాతం పైగా ఉన్న బీసీలు రిజర్వేషన్ల పెంపు కోరుకుంటున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.
ASR: రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఆవుపై పులి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటన చేశారు. పులి దాడి చేసిన ఆవు కళేబరాన్ని దహణం చేశారు. సబ్ DFO సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కోరుమిల్లి గ్రామం సమీప అటవీ ప్రాంతంలో దట్టమైన పొదలలో పులి ఉన్నట్లు తెలిపారు.
SKLM: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఈ మేరకు శనివారం జారీ చేసిన జీవో ద్వారా హామీ అమల్లోకి వచ్చింది. ఆదివారం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి భాస్కరరావు దివ్యాంగులు తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
VZM: అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికీ, నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
E.G: బిక్కవోలు మండలం పందలపాకలో పడాల సూర్యనారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా బ్లడ్ డోనర్స్ & వాలంటీర్స్‌ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.