• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆటోలో దాచిన బంగారం చోరీ

HYD: ఆటోలో దాచిన బంగారం చోరీకి గురైన ఘటన హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. శనివారం మక్కా మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు. ఆటోలో బంగారం దాచి, పార్కింగ్ ఏరియాలో ఆటోను పార్కు చేశారు. అనంతరం వచ్చి చూడగా బంగారం మాయమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

February 28, 2026 / 08:19 PM IST

‘రేపు కూడా పన్నుల చెల్లింపునకు ఛాన్స్’

E.G: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో శనివారం కమిషనర్ రాహుల్ మీనా కీలక ప్రకటన చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఆస్తి, ఖాళీ స్థలం పన్నులు, నీటి ఛార్జీల చెల్లింపునకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నగరపాలక సంస్థ ట్రెజరీలో పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్ లేదా సమీప సచివాలయాల్లో చెక్కుల ద్వారా కూడా పన్నులు కట్టే వెసులుబాటు కల్పించారు.

February 28, 2026 / 08:19 PM IST

‘న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’

ASF: కుమ్మేర గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ వద్ద వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పసిపాప మృతి ఘటనకు కారణమైన అగ్రవర్ణ నాయకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 28, 2026 / 08:19 PM IST

కొత్తూరు పీఎస్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

RR: కొత్తూరు పోలీస్ స్టేషన్‌ను ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ప్రాంగణం, రికార్డ్ రూమ్, స్టేషన్ రైటర్ రూమ్, రిసెప్షన్ సెంటర్ వంటి విభాగాలను పరిశీలించారు. వాటిని చక్కగా నిర్వహించుకోవాలన్నారు. నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీ కేసులు, నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు.

February 28, 2026 / 08:18 PM IST

అప్రెంటిషిప్ శిక్షణ ప్రతిపాదికన ఆర్టీసీలో ఉద్యోగాలు

MBNR: మహబూబ్ నగర్ రీజియన్ పరిధిలో 10 RTC డిపోల గ్యారేజ్, వివిధ విభాగాల్లో అప్రెంటిషిప్ శిక్షణ ప్రతిపాదికన పనిచేయుటకు ఇంజనీరింగ్, డిప్లమా, పట్టభద్రులు, నాన్ ఇంజనీరింగ్ పట్టభద్రులు BA, BSC, BCOMలో 2021 తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు nttp:nats.education.gov.in వెబ్‌సైట్లో మార్చి 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు.

February 28, 2026 / 08:17 PM IST

యువ చైతన్య వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి

కృష్ణా: ఉంగుటూరు(M) ఆత్కూరులో నైపుణ్యాభివృద్ధి కోర్సులో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన యువ చైతన్య వేదిక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. యువత తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని కష్టపడి పని చేసి స్వయం ఆధారంగా నిలబడాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఇందులో విశ్రాంత IAS అధికారి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.

February 28, 2026 / 08:16 PM IST

T20 WC: పాక్ vs లంక మ్యాచ్‌పై అనుమానాలు!

శ్రీలంకతో మ్యాచ్‌లో పాక్ ప్రస్తుతం 15 ఓవర్లలో 163/0 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తీరు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది. పాక్ సెమీస్ చేరాలంటే 65 పరుగుల తేడాతో లేదా 13 ఓవర్లలోపే గెలవాల్సి ఉండగా.. టాస్ గెలిచి లంక బౌలింగ్ ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. PAK క్వాలిఫై అయితేనే సెమీస్ లంకలో జరుగుతుంది. ఈ క్రమంలోనే లంక కావాలనే పాక్‌తో కుమ్మక్కైందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

February 28, 2026 / 08:15 PM IST

10వ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ADB: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, ఇందుకోసం 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

February 28, 2026 / 08:15 PM IST

ఏకీకృత కుటుంబ సర్వే పై ఆరా తీసిన ZP CEO

NLR: బుచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి సందర్శించారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఏకీకృత కుటుంబ సర్వే కు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటి పన్నులు త్వరగా చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.

February 28, 2026 / 08:13 PM IST

‘యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ పై చర్యలు తీసుకోవాలి’

KMM: ఖమ్మం జిల్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించిన యూట్యూబ్ రిపోర్టర్ రఘు‌పై చర్యలు తీసుకోవాలని DCCB మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మధిర టౌన్ ఇన్స్‌పెక్టర్ రమేష్‌కు లిఖితపూర్వకంగా నాయకులు ఫిర్యాదు చేశారు. వర్గ విభేదాలు సృష్టించిన జర్నలిస్టుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.

February 28, 2026 / 08:12 PM IST

అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానమే మూలం

VZM: అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానమే మూలం అని జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డా. ఎంవిఆర్ కృష్ణాజీ అన్నారు. చీపురుపల్లి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక సైన్స్ దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆవిష్కరణలు, శాస్త్ర విజ్ఞానం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, శివాజీ పాల్గొన్నారు.

February 28, 2026 / 08:12 PM IST

ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

PDPL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. వేద పండితులు రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో స్వామివార్లకు అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు స్వామివారికి తులాభారం నిర్వహించారు. గ్రామస్తుల సౌజన్యంతో విచ్చేసిన భక్తులందరికీ భారీగా అన్నదానం చేశారు.

February 28, 2026 / 08:10 PM IST

T20 WC: రేపు భారత్-విండీస్ నాకౌట్ ఫైట్

టీ20 ప్రపంచకప్‌లో రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉండగా, గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. దీంతో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

February 28, 2026 / 08:10 PM IST

సూర్యాపేటలో అక్రమ స్కాన్ సెంటర్ సీజ్

SRPT: సూర్యాపేటలోని ఏప్రిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ సోమ కిరణ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ విచారణ జరిపారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు శనివారం సదరు సెంటర్‌ను సీజ్ చేశారు. అక్రమ స్కాన్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

February 28, 2026 / 08:09 PM IST

బోధన్ పట్టణంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు

NZB: బోధన్ పట్టణంలోని రాకాస్ పేట్లో, పాత బోధన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆధునిక హైమాస్ట్ లైట్లను మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రాంత ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించాలనే ఉద్దేశంతో ఈ లైట్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ ఎలక్ట్రిషన్, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:09 PM IST