• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కీలక ప్రాజెక్టులకు VMRDA ఆమోదం

AP: కీలక ప్రాజెక్టులకు విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అథారిటీ సంస్థ (VMRDA) ఆమోదం తెలిపింది. VMRDA పరిధిలో మౌలిక వసతులకు రూ. 9 కోట్లు కేటాయించింది. అలాగే తీరం కోతకు గురికాకుండా రూ. 200 కోట్లతో చేపట్టే పనులకు, అలాగే మధురవాడలో 2.7 ఎకరాల్లో క్రీడా సముదాయం నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

December 10, 2024 / 08:17 PM IST

కెసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి పాలన: సీపీఐ

ఖమ్మం: కెసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా చలో హైదరాబాద్‌కు తరలి వెళ్తున్న ఆశా కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదన్నారు.

December 10, 2024 / 08:16 PM IST

ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం

PPM: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పార్వతిపురం పాత బస్టాండ్ ఆవరణలో మానవ హక్కుల దినోత్సవంను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యమన్నారు. అనంతరం స్థానికులకు ఆహారపొట్లాలు పంచారు.

December 10, 2024 / 08:15 PM IST

రేపటి నుంచి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు

ప్రకాశం: జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు బుధవారం నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్-1 మోడల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ప్రశ్నా పత్రాలను ఎంఈవో కార్యాలయాల నుంచి ఏ రోజుకారోజు గంటముందు తీసుకెళ్లాలన్నారు. పశ్న పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 22లోపు హోలిస్టర్ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు నమోదు చేయాలని చెప్పారు.

December 10, 2024 / 08:15 PM IST

‘మా హక్కులకు స్పీకర్‌ భంగం కలిగించారు’

TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులు బీఆర్ఎస్ బహిష్కరించనుంది. రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులు బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మాజీమంత్రి కేటీఆర్‌ ప్రకటన విడుదల చేశారు. తమ హక్కులకు స్పీకర్ భంగం కలిగేలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. తొలిరోజే తమ ఎమ్మెల్యేలను లోపలికి రాకుండా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.

December 10, 2024 / 08:09 PM IST

శాంతి భద్రతల సంరక్షణకు ప్రజలు సహకరించాలి: డీఎస్పీ

సూర్యాపేట: శాంతిభద్రతల సంరక్షణకు ప్రజలు సహకరించాలని సూర్యాపేట డీఎస్పీ రవి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్డు నందు మంగళవారం రాత్రి కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించి, సామాజిక అంశాలపై పోలీసు కళా బృందం వారిచే అవగాహన కార్యక్రమం పట్టణ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట డీఎస్పీ రవి మాట్లాడారు.

December 10, 2024 / 08:06 PM IST

ఇజ్రాయెల్‌ నుంచి అస్సాం నేర్చుకోవాలి: సీఎం

ఇజ్రాయెల్ నుంచి అస్సాం నేర్చుకోవాలని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ ఎలా మనుగడ సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ సురక్షితంగా లేవని తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అస్సామీలు మైనారిటీలుగా ఉన్నారని వెల్లడించారు.

December 10, 2024 / 08:02 PM IST

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఉరివేసుకొని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన కుట్రంగి పున్నం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం పున్నం మద్యానికి బానిసై తరచు తల్లిదండ్రులను కొడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం డబ్బులు అడుగగా వారు లేవని చెప్పడంతో వారిని కొట్టి ఇంట్లో నుండి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

December 10, 2024 / 08:02 PM IST

రేపు నోటిఫికేషన్ విడుదల

ప్రకాశం: జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్ ఆయా ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద విడుదల చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. 15 అంగన్వాడీ కార్యకర్త, నాలుగు మినీ అంగన్వాడి కార్యకర్త, 89 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుందని ఈనెల 11 నుంచి 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 10, 2024 / 08:01 PM IST

‘మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం’

NRML: తానూర్ మండలం ఎల్వికి చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లింగమూర్తి, ఎస్ఐ రమేష్, చైన్డ్ లైన్ అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సంవత్సరాలలోపు వయసున్న అమ్మాయికి పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని పెళ్లిని వాయిదా వేయించారు.

December 10, 2024 / 07:58 PM IST

‘భారత ఆటోమొబైల్ పరిశ్రమ.. ఐదేళ్లలో నంబర్‌ 1’

భారత ఆటోమొబైల్ పరిశ్రమ రానున్న ఐదేళ్లలో అంతర్జాతీయంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగం గత పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 కోట్లకు వృద్ధి చెందినట్లు వెల్లడించారు. ప్రఖ్యాత గ్లోబల్ ఆటోమొబైల్ బ్రాండ్‌లు భారతదేశంలో ఉండటం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు.

December 10, 2024 / 07:56 PM IST

‘తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి’

PDPL: కేంద్రాలలో తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ డి వేణు మంథని మండలంలోని పవర్ హౌస్ కాలనీ, అంగళూరు, గుంజ పడుగు, నాగారం గ్రామాలు, రామగిరి మండలంలో సుందిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

December 10, 2024 / 07:55 PM IST

అన్నదాతకు అండగా వైసీపీ

PPM: అన్నదాతకు అండగా వైసీపీ ఉంటుందని పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రైతన్నలను దగా చేస్తున్న కూటమి సర్కార్ పై నిరసనగా గళం విప్పేందుకు వైసీపీ సిద్ధమైందన్నారు. ఈనెల 13వ తేదీన భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.

December 10, 2024 / 07:54 PM IST

గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ మోసం చేసింది: బ్రహ్మానంద్

ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు. 12 నెలల కాలంలో ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

December 10, 2024 / 07:54 PM IST

బల్లికురవలో రెవెన్యూ సదస్సులు

ప్రకాశం: బల్లికురవ మండలంలోని రెవెన్యూ విలేజ్ అయినటువంటి కొనిదెన గ్రామంలో రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం రెవెన్యూ పరిధిలో దాదాపుగా 100 అర్జీలను స్వీకరించినట్లుగా అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 07:50 PM IST