TG: జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనపై మోహన్‌బాబు స్పందించారు. ‘మనోజ్ నువ్వు నా బిడ్డవు. నిన్ను ఎలా పెంచానురా నేను.. అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను. నువ్వు ఏది అడిగినా నీకిచ్చాను. కానీ నువ్వు ఈరోజు చేస్తున్న పని.. బిడ్డలు గుండెల మీద తంతారంటారే.. అలా తన్నావురా. నా మనసు ఆవేదనతో కృంగిపోతుంది. నేను మీ అమ్మ ఏడుస్తున్నామ్. మీ అమ్మ ఎంతో కుమిలిపోత...
AP: వైసీపీ నేత సజ్జల రామ కృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. సజ్జలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది.
ASR: సూపర్ సిక్స్‌ను వెంటనే అమలు చేయాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6నెలలు అవుతుందన్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులకు రూ.20వేలు ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.
కామారెడ్డి: బాన్సువాడ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆగ్రో చైర్మన్ మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ ఉన్నారు.
NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావును మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో నెల్లూరు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండి తిరుమలరావుని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సమస్యలు, తదితర విషయాలను చర్చించడం జరిగిందన్నారు.
AP: కీలక ప్రాజెక్టులకు విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అథారిటీ సంస్థ (VMRDA) ఆమోదం తెలిపింది. VMRDA పరిధిలో మౌలిక వసతులకు రూ. 9 కోట్లు కేటాయించింది. అలాగే తీరం కోతకు గురికాకుండా రూ. 200 కోట్లతో చేపట్టే పనులకు, అలాగే మధురవాడలో 2.7 ఎకరాల్లో క్రీడా సముదాయం నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఖమ్మం: కెసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా చలో హైదరాబాద్‌కు తరలి వెళ్తున్న ఆశా కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదన్నారు.
PPM: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పార్వతిపురం పాత బస్టాండ్ ఆవరణలో మానవ హక్కుల దినోత్సవంను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యమన్నారు. అనంతరం స్థానికులకు ఆహారపొట్లాలు పంచారు.
ప్రకాశం: జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు బుధవారం నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్-1 మోడల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ప్రశ్నా పత్రాలను ఎంఈవో కార్యాలయాల నుంచి ఏ రోజుకారోజు గంటముందు తీసుకెళ్లాలన్నారు. పశ్న పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 22లోపు హోలిస్టర్ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు నమోదు చేయాలని చెప్పారు.
TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులు బీఆర్ఎస్ బహిష్కరించనుంది. రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులు బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మాజీమంత్రి కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. తమ హక్కులకు స్పీకర్ భంగం కలిగేలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. తొలిరోజే తమ ఎమ్మెల్యేలను లోపలికి రాకుండా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.
సూర్యాపేట: శాంతిభద్రతల సంరక్షణకు ప్రజలు సహకరించాలని సూర్యాపేట డీఎస్పీ రవి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్డు నందు మంగళవారం రాత్రి కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించి, సామాజిక అంశాలపై పోలీసు కళా బృందం వారిచే అవగాహన కార్యక్రమం పట్టణ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట డీఎస్పీ రవి మాట్లాడారు.
ఇజ్రాయెల్ నుంచి అస్సాం నేర్చుకోవాలని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ ఎలా మనుగడ సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ సురక్షితంగా లేవని తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అస్సామీలు మైనారిటీలుగా ఉన్నారని వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన కుట్రంగి పున్నం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం పున్నం మద్యానికి బానిసై తరచు తల్లిదండ్రులను కొడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం డబ్బులు అడుగగా వారు లేవని చెప్పడంతో వారిని కొట్టి ఇంట్లో నుండి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం: జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్ ఆయా ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద విడుదల చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. 15 అంగన్వాడీ కార్యకర్త, నాలుగు మినీ అంగన్వాడి కార్యకర్త, 89 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుందని ఈనెల 11 నుంచి 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NRML: తానూర్ మండలం ఎల్వికి చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లింగమూర్తి, ఎస్ఐ రమేష్, చైన్డ్ లైన్ అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సంవత్సరాలలోపు వయసున్న అమ్మాయికి పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని పెళ్లిని వాయిదా వేయించారు.