ELR: భీమడోలు మండలం గుండుగొలను వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులను మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. ఈ మేరకు కాలువలో పేరుకుని ఉన్న గుర్రపుడెక్కను వెంటనే తొలగించి రైతులకు దాళ్వా పంటకు సాగునీటికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూడాలని, ఇరిగేషన్ అధికారులుతో మాట్లాడారు. వంతెన పనులు గురించి స్థానిక కూటమి నాయకులతో చర్చించారు.
KNR: ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో గల ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భవనాన్ని 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. దానిని ప్రెస్ క్లబ్‌కు కేటాయించాలని మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారికి గుండోజు సత్తయ్యకు ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ బృందం ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
NLR: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్ర బాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో బుచ్చి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి నాగేంద్ర బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీని కష్టకాలంలో అండగా నిలిచారని ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కడం హర్షనీయమన్నారు.
BDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పంపిణి కొరకు నిర్వహించాల్సిన సర్వేలో కొన్ని సవరణలు చేసినట్లయితే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు చేరుతాయని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు రామారావు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కు తెలియజేశారు. ఈ సమస్యపైన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
TG: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనం జప్తు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GDWL: ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ -2 పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు మంగళవారం సూచించారు. 2 పరీక్షలు 2 రోజులపాటు 4 దఫాలుగా నిర్వహిస్తామన్నారు. ఉదయం 10:00 నుంచి 12:30 వరకు మధ్యాహ్నం 3:00 నుంచి 5: 30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలన్నారు.
KRNL: వెలగపూడిలోని సచివాలయంలో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు CM చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పీ.రంజిత్ బాషా, జీ.రాజకుమారి హాజరుకానున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తదితర అంశాలపై CM దిశా నిర్దేశం చేయనున్నారు.
NDL: గృహిణులకు, నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డోన్ యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆర్&బి అతిథి గృహంలో మహిళలకు ఉపాధి సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధి లేని మహిళలందరికీ ఉపాధి కల్పించడం తమ లక్ష్యమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
AP: విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. విశాఖకు చెందిన మహిళ నిన్న రాత్రి తలకు గాయమై స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. దీన్ని అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి ప్రకాష్ దుస్తులు తీయాలని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
VZM: జిల్లాలో గత వారం రోజుల్లో అసాంఘిక కార్యకలపాలపై నమోదు చేసిన కేసుల వివరాలను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. పేకాట, కోడి పందాలు ఆడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి, 56 మందిని అరెస్టుచేసి, వారి వద్ద నుండి రూ.86,134 నగదు, 5 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం కలిగిన వారిపై 14 కేసులు నమోదు చేసి, 14మందిని అరెస్టు చేశామన్నారు.
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమై ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
KMM: మధిర పట్టణంలో ఎడ్లబండితో ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. మండల అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే మండల అధికారులు స్పందించి ఎడ్లబండితో అక్రమంగా తీసుకు రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
VZM: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చేందుకు సంకల్ప రథంతో పట్టణంలోని జొన్నగుడ్డి, రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను, మాదక ద్రవ్యాల వినియోగం వలన తమ జీవితాలు, కుటుంబాలు ఏవిధంగా చిత్రం అవుతున్నాయో వివరిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు.
కోనసీమ: రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈనెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని మాజీ MLA జగ్గీరెడ్డి కోరారు. ‘అన్నదాతకు అండగా వైఎస్ఆర్‌సీపీ’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను రావులపాలెం YCP కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.