NDL: గృహిణులకు, నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డోన్ యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆర్&బి అతిథి గృహంలో మహిళలకు ఉపాధి సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధి లేని మహిళలందరికీ ఉపాధి కల్పించడం తమ లక్ష్యమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
AP: విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. విశాఖకు చెందిన మహిళ నిన్న రాత్రి తలకు గాయమై స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. దీన్ని అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి ప్రకాష్ దుస్తులు తీయాలని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
VZM: జిల్లాలో గత వారం రోజుల్లో అసాంఘిక కార్యకలపాలపై నమోదు చేసిన కేసుల వివరాలను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. పేకాట, కోడి పందాలు ఆడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి, 56 మందిని అరెస్టుచేసి, వారి వద్ద నుండి రూ.86,134 నగదు, 5 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం కలిగిన వారిపై 14 కేసులు నమోదు చేసి, 14మందిని అరెస్టు చేశామన్నారు.
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమై ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
AP: మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తిరుమల శ్రీవారికి 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. కాగా జనవరి 14న ధనుర్మాసం ముగియనుంది.
KMM: మధిర పట్టణంలో ఎడ్లబండితో ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. మండల అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే మండల అధికారులు స్పందించి ఎడ్లబండితో అక్రమంగా తీసుకు రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
VZM: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చేందుకు సంకల్ప రథంతో పట్టణంలోని జొన్నగుడ్డి, రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను, మాదక ద్రవ్యాల వినియోగం వలన తమ జీవితాలు, కుటుంబాలు ఏవిధంగా చిత్రం అవుతున్నాయో వివరిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు.
కోనసీమ: రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈనెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని మాజీ MLA జగ్గీరెడ్డి కోరారు. ‘అన్నదాతకు అండగా వైఎస్ఆర్‌సీపీ’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను రావులపాలెం YCP కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.
PLD: చిలకలూరిపేట నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా చిలకలూరిపేట వంద పడకల ఆస్పత్రికి అవసరమైన సిబ్బంది, పరికరాల ఏర్పాటు, అత్యాధునిక వసతులకు నిధులు మంజూరు చేసి సహకారం అందించాలని కోరారు.
సిరిసిల్ల పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్యాధికారికి వసంతరావుకు వినతిపత్రం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు పాటించని ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KMM: రఘునాధపాలెంలో ఒంటరి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
AP: ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్‌కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ. ఈ నేపథ్యంలోనే ‘నానా హైరానా’ సాంగ్‌ను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ సాంగ్ క...
SKLM: ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ -2 సర్పంచ్ కృష్ణారావుకు 104 సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. తమకి నెల నెల జీతాలు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. దీనితో కుటుంబ పోషణ కష్టమవుతుందని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి సమీపన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు (బుధవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి మంగళవారం తెలిపారు. జాబ్ మేళకు 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతీ యువకులు తమ సర్టిఫికెట్స్‌తో ఇంటర్వ్యూకు హాజరుకావాలని అన్నారు.