• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎమ్మెల్యేకు వెటర్నరీ విద్యార్థుల వినతి

VZM: చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును శుక్రవారం గరివిడి వెటర్నరి కాలేజీ విద్యార్థులు కలిసారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా వెటర్నరీ గ్రాడ్యుయేట్లు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని ఈ పోస్ట్‌ గ్రామీణ పశుసంవర్థక వ్యవస్థలో అత్యంత కీలకమన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసువెళ్లాలని ఆయనకు వినతిపత్రం అందించారు.

February 28, 2026 / 09:00 AM IST

జోరుగా సాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

PPM: కొమరాడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. ఇందులో భాగంగా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సొమ్మును అందించారు. కొమరాడ మండల రైతు అధ్యక్షుడు బత్తిలి శ్రీను ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేసినట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు.

February 28, 2026 / 09:00 AM IST

డయేరియాకు ‘ఈ-కోలి’ బ్యాక్టీరియానే కారణం: కమిషనర్

SKLM: నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం ఆయన నగరంలోని డయేరియా ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటివరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా, 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

February 28, 2026 / 09:00 AM IST

పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే?

T20 WC-2026లో భాగంగా పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే శ్రీలంకను ఓడించాలి. రన్ రేట్ పరంగా కూడా న్యూజిలాండ్‌ను అధిగమించాలి. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే శ్రీలంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. లక్ష్యాన్ని ఛేదించాలంటే, 13.1 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించాలి. విఫలమైతే న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్‌కు వెళ్తుంది. అంటే నెట్ రన్ రేట్ ఈ మ్యాచ్‌కు కీలకం కానుంది.

February 28, 2026 / 09:00 AM IST

ఇవాళ్టితో ముగియనున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదకొండో రోజైన ఇవాళ ఉదయం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోల్సోత్సవం నిర్వహించనున్నారు. దీంతో 11 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. నిన్న ఉదయం మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి చక్రతీర్థం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు.

February 28, 2026 / 08:59 AM IST

కాశీబుగ్గలో అధిక వడ్డీ మోసం

WGL: 20వ డివిజన్ కాశీబుగ్గలో అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కిరాణా వ్యాపారి వీరశెట్టి సురేశ్ స్థానికులను నమ్మించి దాదాపు ఒక కోటి రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడు. 15 రోజుల క్రితం తన షాపుకు తాళం వేసి అప్పటి నుంచి కనిపించకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 08:54 AM IST

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: నిండ్ర మండలం కైపాకం నందు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం స్థానిక కూటమి నాయకులతో కలిసి పింఛన్‌లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నందు మాత్రమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం వృద్దులు, వితంతువులకు ప్రతి నెల అందిస్తున్నామని తెలిపారు.

February 28, 2026 / 08:52 AM IST

తిరుపతిలో రుయాలో ఉచితంగా డయాలసిస్

తిరుపతి రుయా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. రెండు మెషీన్లు ఏర్పాటు చేయగా వీటిని శుక్రవారం ప్రారంభించారు. గతంలోనే నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో పేదలకు డయాలసిస్ చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో, తీవ్రమైన కిడ్నీ సమస్య ఉన్నవారికి ఈ కొత్త సెంటర్లో ఉచితంగా డయాలసిస్ చేస్తారు. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 24 గంటలు ఇది తెరిచే ఉంటుంది.

February 28, 2026 / 08:50 AM IST

‘సీడ్ పత్తి రైతులకు బకాయిలు చెల్లించాలి’

GDWL: జిల్లాలో సీడ్ పత్తి రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, NHPS జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కలిగి వినతిపత్రం అందజేశారు. హామీ ఇచ్చిన 80% పేమెంట్లు ఇంకా పూర్తవలేదని, తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 08:49 AM IST

‘వార్డు సభ్యులు అవగాహన పెంచుకున్నారు’

MNCL: లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు వివిధ చట్టాలపై అవగాహన పెంచుకున్నారని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. నూతన వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వారికి పంచాయతీరాజ్ చట్టం, గ్రామపంచాయతీ విధులు, నిధులు, బాధ్యతల గురించి వివరించామన్నారు.

February 28, 2026 / 08:47 AM IST

కనిగిరిలో నేడు ప్రత్యేక సమావేశం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం జరగనుంది. మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్లు, పాలక సభ్యులు అధికారులు పాల్గొంటారని అన్నారు.

February 28, 2026 / 08:47 AM IST

రేపే గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు

ELR: పెదవేగి అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 08:47 AM IST

భూభారతిలో స్కాం.. తహసీల్దార్లపై చర్యలుంటాయా..?

TG: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన భూభారతి స్కాం యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులో మోసం చేశారని పలువురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే రిజిస్ట్రేషన్ చేసే ముందు క్షుణ్ణంగా చెక్ చేయాల్సిన తహసీల్దార్లు ఎందుకు చేయలేదనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు.‌

February 28, 2026 / 08:46 AM IST

నేడే ట్రెడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపు చివరి రోజు..!

KRNL: 2026-27 సంవత్సరానికి ట్రెడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుకు నేడు చివరి తేదీగా ఉంది అని కమిషనర్ హరిప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఫ్యాక్టరీ యజమానులు, వ్యాపారస్థులు ఫీజు చెల్లించి రసీదు, లైసెన్స్ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని అయన సూచించారు. తరవాత, మార్చి 1వ నుంచి 25% మరియు ఏప్రిల్ నుంచి 50% అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు.

February 28, 2026 / 08:46 AM IST

కృష్ణ మండల గ్రామపంచాయతీ శిక్షణ

NRPT: కృష్ణ మండలంలోని గ్రామపంచాయతీ అభివృద్ధి విధివిధానాలపై ఐదు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. అన్ని గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొని పంచాయతీ పాలన, నిధుల వినియోగంపై అవగాహన పొందారు. ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ విజయవంతం చేసిన సభ్యులను అభినందించారు.

February 28, 2026 / 08:46 AM IST